Ayodhya Ram Mandir : అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

Ayodhya Ram Mandir  : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగి వారం రోజులు అవుతుంది. అయినా కానీ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నిరంతరం కొనసాగుతూనే ఉంది. రాములల్లాను దర్శించుకోవాలని అయోధ్యకు వేరువేరు ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. తీవ్రమైన చలిలో కూడా గజగజ వణుకుతూ భక్తులు రామ్ లల్లా దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. అయితే పెద్దలతో పాటు పిల్లలు యువత కూడా […]

  • Published On:
Ayodhya Ram Mandir : అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

Ayodhya Ram Mandir  : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగి వారం రోజులు అవుతుంది. అయినా కానీ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నిరంతరం కొనసాగుతూనే ఉంది. రాములల్లాను దర్శించుకోవాలని అయోధ్యకు వేరువేరు ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. తీవ్రమైన చలిలో కూడా గజగజ వణుకుతూ భక్తులు రామ్ లల్లా దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. అయితే పెద్దలతో పాటు పిల్లలు యువత కూడా రామ్ లల్లా దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. భక్తుల కోసం సేవా సంస్థల వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

అయోధ్య అధికారులు అలాగే వివిధ మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజన శాలలు అందుబాటు లో ఉంచారు. అయితే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్ లల్లాను దర్శించుకునేందుకు కోసం టెన్ సిటీని నిర్మించి ప్రారంభించారు. అయితే దీనిలో 20 వేల మంది భక్తులు భోజనం చేసేలా దీని నిర్మించడం జరిగింది. అయితే ఈ టెన్ సిటీ లోను ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అయోధ్యకు చాలా ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఉచిత భోజనం చేసే అవకాశం ఉంది. వారం రోజులకే అయోధ్యలో భక్తుల రద్దీ చాలా పెరగడంతో కొన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా ఎన్ని రోజులు అయోధ్య లో భక్తుల రద్దీ కొనసాగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది.