Ram Lalla Coin : రాముడు పేరిట నాణేలు విడుదల… ఎలా పొందాలంటే…

Ram Lalla Coin : అయోధ్యలో జనవరి 22న రాములల్ల విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విగ్రహ ప్రతిష్ట నుంచి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం రోజు మూడు సావనీర్ నాణేలను విడుదల చేయడం జరిగింది. ఒక వీటిలో బాలరామయ్య అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం ,థీమ్ ఆధారంగా ఒకటి రూపొందించారు. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిల్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా […]

  • Published On:
Ram Lalla Coin : రాముడు పేరిట నాణేలు విడుదల… ఎలా పొందాలంటే…

Ram Lalla Coin : అయోధ్యలో జనవరి 22న రాములల్ల విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విగ్రహ ప్రతిష్ట నుంచి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం రోజు మూడు సావనీర్ నాణేలను విడుదల చేయడం జరిగింది. ఒక వీటిలో బాలరామయ్య అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం ,థీమ్ ఆధారంగా ఒకటి రూపొందించారు. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిల్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి 19వ స్థాపన కార్యక్రమంలో నిర్మల సీతారామన్ ఈ మూడు నాణాలను ఆవిష్కరించారు. ఇక వీటిలో స్థాప జ్ఞాపకార్థం లోహ కవచమైన సావనీర్ నాణెం… అదేవిధంగా భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి ఖడ్గ మృగం ఉన్న మరొక నాణెం ఈ విధంగా మూడు నాణేలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం మాట్లాడుతూ… SPMCIL సంస్థ విడుదల చేసిన స్మారక స్టాంపులు ఆకట్టుకునే విధంగా ఉంటాయని ఆమె చెప్పడం జరిగింది. అయితే దానితోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు దివ్యాంగులకు సంబంధించిన ఆందోళనల , పర్యావరణ ఆందోళనలు, తెలుసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా ఇలాంటి నాణేలు బహుమతిగా ఇవ్వడానికి విలువైన వస్తువులుగా మారడానికి తగినంత ఆకర్షణీయంగా మారుతాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇక ఈ నాణేలకు సంబంధించిన ఫోటోలను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.