Pooja Room Tips : పూజ గదిలో అగరబత్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారా….అయితే ఈ విషయం తెలుసుకోండి…

Pooja Room Tips : భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవుని పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యాలు ఉండాల్సిందే. ఇవి లేకుండా భారతదేశంలోని ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి కాదు. ఇక ఈ పూజా కార్యక్రమంలో అగరబత్తీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అని చెప్పాలి. అయితే పూజ సమయంలో ప్రతి ఇంట్లో కూడా అగరబత్తీలు వెలిగిస్తుంటారు. మరికొందరు వీటిని దోమల కోసం కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ అగరబత్తీలను ఎక్కువగా వినియోగించడం వలన […]

  • Published On:
Pooja Room Tips : పూజ గదిలో అగరబత్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారా….అయితే ఈ విషయం తెలుసుకోండి…

Pooja Room Tips : భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవుని పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యాలు ఉండాల్సిందే. ఇవి లేకుండా భారతదేశంలోని ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి కాదు. ఇక ఈ పూజా కార్యక్రమంలో అగరబత్తీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అని చెప్పాలి. అయితే పూజ సమయంలో ప్రతి ఇంట్లో కూడా అగరబత్తీలు వెలిగిస్తుంటారు. మరికొందరు వీటిని దోమల కోసం కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ అగరబత్తీలను ఎక్కువగా వినియోగించడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి తెలుసా…? వీటి వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా…

అగరబత్తీలు అనేవి పూజా విధానంలో ఒక భాగం. వీటి నుండి విడుదలయ్యే పరిమళమైన సువాసన ప్రతి ఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాక మన నివసిస్తున్న ప్రాంతాలలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుందని పెద్దల నమ్మకం. అదే ఇదంతా వినటానికి బాగానే అనిపిస్తుంది కానీ వీటి వలన చెడు కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే సమస్య వచ్చేది అగరబత్తుల నుంచి కాదట దాని నుండి వచ్చే పొగ వలన అని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ప్రపంచం ఇప్పటికే కలుషితంలో నిండిపోయింది. స్వచ్ఛమైన గాలి కూడా కరువైంది. మన పూర్వీకులు అందరూ కాలుష్య రహిత పర్యావరణం లో జీవిస్తే మనం మాత్రం కలుషితమైన గాలిని పిలుస్తూ జీవితాలను గడుపుతున్నాం. ఇక ఇలాంటి సమయంలో అగరబత్తులు వెలిగించి మన చుట్టూ ఉన్న పొగను మరింత కలుషితం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇదే విషయంపై పరిశోధకులు పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికిి వచ్చారు . అదేంటంటే మానవులకు అగరబత్తులు హానికరం చేస్తాయి. ఇంతకీ వీటి వలన ఎలాంటి హాని జరుగుతుంది అనే విషయానికొస్తే అగరబత్తులను ఇంట్లో ఎక్కువగా ఉపయోగించడం వలన శ్వాస కోశ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే దగ్గు, ఆస్తమా ఎలర్జీ , తలనొప్పి వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిని తయారు చేయడానికి ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉపయోగిస్తారు. దీని కారణంగా దీనిని వెలిగించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు దీని నుండి వెలువడుతున్నాయి. ఇక ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని మిత్రులు చెబుతున్నారు. కాబట్టి వీటిని పీల్చడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.