Tamil Nadu : తమిళనాడులో నరమాంస భక్షకుడు…

Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలోని ఓ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.ఆ కేసుకు సంబంధించి ఒక్కొక్క లింకును విప్పుతూ పోయిన పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురయింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంట్లో దొరికిన మనిషి పుర్రెలు ఎముకలు అతనిలోని వికృత రూపాన్ని బయటపెట్టాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడు తంజావూరు జిల్లా చోళపురం గ్రామానికి చెందిన 47 ఏళ్ల సిద్ధ వైద్యుడు కేశవమూర్తి […]

  • Published On:
Tamil Nadu : తమిళనాడులో నరమాంస భక్షకుడు…

Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలోని ఓ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.ఆ కేసుకు సంబంధించి ఒక్కొక్క లింకును విప్పుతూ పోయిన పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురయింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంట్లో దొరికిన మనిషి పుర్రెలు ఎముకలు అతనిలోని వికృత రూపాన్ని బయటపెట్టాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడు తంజావూరు జిల్లా చోళపురం గ్రామానికి చెందిన 47 ఏళ్ల సిద్ధ వైద్యుడు కేశవమూర్తి స్థానికంగా వైద్యం చేస్తూ జీవితం గడుపుతున్నాడు. అయితే తాజాగా చికిత్స కోసం వచ్చిన అశోక్ మూర్తి అనే కుర్రాడి మిస్సింగ్ కేస్ కేశవమూర్తి బండారం బయటపడింది. అయితే చికిత్స నిమిత్తం 25 సంవత్సరాలు గల అశోక మూర్తి అనే కుర్రాడు కేశవ మూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయాడు.

tamil-nadu-viral-news

దీంతో అతని కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సిద్ధ వైద్యుడు కేశవ మూర్తిని పోలీసులు విచారించడం జరిగింది. అలాగే అతని ఇంటిని తనిఖీ చేయగా యువకుడి శరీర భాగాలు అతని ఇంటి ముందు పాతిపెట్టినట్లుగా తెలిసింది. ఇక వాటిలో మరికొన్ని శరీర భాగాలు మిస్ అయ్యాయి. దీంతో కేశవ మూర్తి ఇంటిని సీజ్ చేసి జెసిబి తో ఇల్లు మొత్తం తవ్వి చూడగా పుర్రెలు ఎముకలు బయటికి వచ్చాయి. ఆ దృశ్యాలను చూసి పోలీసులు సైతం బెంబేలెత్తిపోయారు. అయితే కేశవమూర్తి మత్తుమందు ఇచ్చి చికిత్స కోసం వచ్చిన వారిని హత్య చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అతను ఇంట్లో సేకరించిన శరీర భాగాలను ఫారెన్సీకే లాబ్ కు పోలీసులు తరలించారు. అంతేకాక కేశవమూర్తి తాను స్వయంగా తయారు చేసిన మత్తు మాత్రలని తమిళనాడు వ్యాప్తంగా యువకులతో విక్రయిస్తున్నట్లుగా బయటపడింది. ఈ క్రమంలోని కేశవమూర్తి కరకసత్వంపై స్థానికంగా కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సిద్ధ వైద్యుడిగా ఉన్న కేశమూర్తి ఈ కేసులో దొరికిపోయాడు కానీ అతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. అతని ఇంటి ఆవరణలో కొన్ని డజన్ల కొద్ది పుర్రెలు ఎముకలు లభ్యమయ్యాయి. అంటే మనోడు ఎంతమందిని చంపాడు అనేది ఎవరికీ తెలియదు. ఇక మనుషులను చంపడమే కాక వారి శరీర భాగాలను నరికి వాటితో షూప్ చేసుకొని తాగిన వీడియోలను ఫోన్ లో చిత్రీకరించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కేసు పై ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఈ క్రమంలోనే అతని ఇంటిని తదితర వస్తువుల్ని ఆధీనం చేసుకున్న పోలీసులు తన లాప్టాప్ ని కూడా చెక్ చేస్తే ఎంతమందిని చంపాడు అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే మృతుడు అశోక్ మూర్తి స్థానిక పీఎంకే పార్టీకి చెందిన కార్యకర్త. అతని మిస్సింగ్ గురించి ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తంజావూర్ కలెక్టర్ కి పిఎంకె నేతలు వినతి పత్రం అందించారు. అలాగే సిద్ధ వైద్యుడు కేశవమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును వీలైనంత త్వరగా సిబిఐకి అప్పగించాలని కేశవమూర్తి వెనుక ఉన్న మాఫియాని పట్టుకోవాలని తెలియజేశారు.