Business Idea : పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్…రూ.5 వేల పెట్టుబడితో నెలకు 80వేలు ఆదాయం..

Business Idea  :  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాల ఫైనాన్షియల్ సర్వీస్ లను అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా దీని ద్వారా ప్రజల చెంతకు చేరుస్తుంది. ఈ క్రమంలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సరికొత్త ఆపర్చునిటీ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ప్రాంచేజీ స్కీం ద్వారా….రూ.5000 ప్రారంభ పెట్టుబడితో తన వెంచర్లను స్థాపించుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. […]

  • Published On:
Business Idea : పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్…రూ.5 వేల పెట్టుబడితో నెలకు 80వేలు ఆదాయం..

Business Idea  :  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాల ఫైనాన్షియల్ సర్వీస్ లను అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా దీని ద్వారా ప్రజల చెంతకు చేరుస్తుంది. ఈ క్రమంలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సరికొత్త ఆపర్చునిటీ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ప్రాంచేజీ స్కీం ద్వారా….రూ.5000 ప్రారంభ పెట్టుబడితో తన వెంచర్లను స్థాపించుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి గలవారు భారతదేశంలోని ప్రజలకు ఇండియా పోస్ట్ అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంటర్ ప్రేన్యూర్స్ వారు సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచేజ్ స్కీం అందిస్తుంది. ఈ ప్రభుత్వ సంస్థ లో మెంబర్ గా ఉండటం వలన వచ్చే అన్ని బెనిఫిట్స్ ను పొందవచ్చు.

post-office-franchise-scheme-investment-of-rs-5000-rs-80000-per-month

అర్హతలు…..

ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచెజ్ స్కీంను అప్లై చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు లేదా శాశ్వత భారతీయ నివాసితులు అయి ఉండాలి. దీనిలో 30 సంవత్సరాల వయోపరిమితిని నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు ,షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. అలాగే గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం.

ఆదాయం ఎంత…..?

ఈ స్కీం ద్వారా ఆమోదం పొందిన తర్వాత ఫ్రాంచైజీలు తమ స్టోర్ లో అందించిన పోస్టల్ సేవలు మరియు వస్తువుల విక్రయాల ఆధారంగా కమిషన్ అందిస్తారు. అలాగే కస్టమర్ల సంఖ్యను బట్టి ప్రారంభ ఆదాయం 20వేల నుండి 80 వేల వరకు ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఎక్కువ కృషి అంకితభావం మరియు ఎక్కువ సేవలను అందించడం వలన మరింత రెవెన్యూ పొందే అవకాశం ఉంది.

అప్లై చేసుకోవడం ఎలా…?

దీనికోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ను ప్రారంభించేముందు పోస్ట్ ఆఫీస్ అందించిన అధికారిక నోటిఫికేషన్ ను జాగ్రత్తగా చదవాలి. ఈ స్కీమ్ ను అప్లై చేసుకోవాలి అనుకునేవారు అధికారిక వెబ్సైట్ను (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) సందర్శించవచ్చు.