LIC Policy : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.58 చెల్లిస్తే 8 లక్షలు రిటర్న్స్ ..

LIC Policy : ఎల్ఐసి మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎల్ఐసి ఆధార్ శీలా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఈ స్కీం లో ప్రతిరోజు రూ.58 కడితే మెచ్యూరిటీ టైం కి 8 లక్షల వరకు పొందవచ్చు. 8 నుంచి 55 సంవత్సరాల వయసు గల స్త్రీలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద పాలసీదారు మరణించిన తర్వాత కూడా […]

  • Published On:
LIC Policy : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.58 చెల్లిస్తే 8 లక్షలు రిటర్న్స్ ..

LIC Policy : ఎల్ఐసి మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎల్ఐసి ఆధార్ శీలా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఈ స్కీం లో ప్రతిరోజు రూ.58 కడితే మెచ్యూరిటీ టైం కి 8 లక్షల వరకు పొందవచ్చు. 8 నుంచి 55 సంవత్సరాల వయసు గల స్త్రీలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద పాలసీదారు మరణించిన తర్వాత కూడా నామినీకి మొత్తం డబ్బు అందజేస్తారు. ఈ పథకం కింద కస్టమర్లు డబ్బులు పొదుపు చేయగలుగుతారు. అలాగే మంచి రాబడిని కూడా పొందుతారు.

ఈ స్కీమ్ ను ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించారు. మహిళలు ఈ పాలసీ గురించి తెలుసుకొని ఇందులో పెట్టుబడి పెట్టారంటే భవిష్యత్తులో మీకు ఆర్థికంగా అండగా ఉంటుంది. కనీస పాలసీ వ్యవధి పది సంవత్సరాలు. గరిష్టంగా 20 సంవత్సరాలు ఉంది. ఈ ప్లాన్ మెచ్యూరిటీ గరిష్ట వయసు 70 సంవత్సరాలు. పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై లాయల్టీ అడిషన్ సౌకర్యం ఉంటుంది. పాలసీ ముగిసేసరికి ఒకేసారి మొత్తాన్ని అందుకుంటారు. ఈ పథకం కింద కనీసం 75000 రూపాయలు, గరిష్టంగా 3 లక్షల రూపాయలను పొదుపు చేయవచ్చు.

30 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే వరుసగా 20 సంవత్సరాలు ప్రతిరోజూ రూ. 58 డిపాజిట్ చేస్తే మొదటి సంవత్సరంలో మొత్తం రూ. 21,918 అవుతుంది. దానిపై 4.5 శాతం పన్ను చెల్లించాలి. రెండో సంవత్సరంలో రూ.21446 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయాలి. ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 429392 అవుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ.794000 అవుతోంది. అంటే మెచ్యూరిటీ సమయానికి దాదాపుగా 8 లక్షల దాకా తిరిగి పొందవచ్చు. మహిళలకు ఇంతకన్నా బెస్ట్ పథకం మరొకటి ఉండదు.

Must Read : Hair Tips : 5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా ..