Business idea : ఉద్యోగం లేదని బాధపడుతున్నారా..అయితే ఇది మీకోసమే..రెండు లక్షలు పెట్టుబడి నెలకు 50 వేలు సంపాదన..

Business idea : ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారా.. ఎంత ప్రయత్నించిన ఉద్యోగం లభించడం లేదా… అయితే లో బడ్జెట్లో మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది. ఈ వ్యాపారం గనక మీరు చేస్తే ఉద్యోగం చేసి సంపాదించిన దాని కంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. అయితే పెట్టుబడి విషయంలో కూడా ఇప్పుడు వెనకడాల్సిన అవసరం లేదు వ్యాపారం చేయాలనుకునే వారికి మోడీ సర్కార్ ముద్ర రుణాల ద్వారా చేయూతనిస్తుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుల నుండి […]

  • Published On:
Business idea : ఉద్యోగం లేదని బాధపడుతున్నారా..అయితే ఇది మీకోసమే..రెండు లక్షలు పెట్టుబడి నెలకు 50 వేలు సంపాదన..

Business idea : ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారా.. ఎంత ప్రయత్నించిన ఉద్యోగం లభించడం లేదా… అయితే లో బడ్జెట్లో మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది. ఈ వ్యాపారం గనక మీరు చేస్తే ఉద్యోగం చేసి సంపాదించిన దాని కంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. అయితే పెట్టుబడి విషయంలో కూడా ఇప్పుడు వెనకడాల్సిన అవసరం లేదు వ్యాపారం చేయాలనుకునే వారికి మోడీ సర్కార్ ముద్ర రుణాల ద్వారా చేయూతనిస్తుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుల నుండి ఈ రుద్ర రుణాలను తీసుకోవచ్చు. బయట వడ్డీకి తీసుకువచ్చి దానికంటే ఇది చాలా తక్కువ వడ్డీతో వస్తుంది. ఇక బిజినెస్ విషయానికొస్తే తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాన్ని అర్జించవచ్చు.

ఫుడ్ బిజినెస్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న సంగతి మనకు తెలిసిందే . దీనికి నిదర్శనంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను చూపించవచ్చు. అయితే మహారాష్ట్రలో వడపావు చాలా ఫేమస్, ముంబై పూణే ఇంకా కొన్ని ప్రాంతాల్లో వడపావు గురించి తెలియని వారు ఉండరు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మహారాష్ట్రలోని ఏ ప్రాంతానికి వెళ్లిన వడపావు సెంటర్లు కనిపిస్తూనే ఉంటాయి.మహారాష్ట్రలో మాత్రమే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది వడపావు రుచి ని ఇష్టపడుతున్నారు. మీరు ఒక కొత్త తరహా బిజినెస్ కోసం చూస్తున్నారంటే మాత్రం ఈ వడపావు సెంటర్ ను ప్రారంభించడం చాలా మంచిదని చెప్పాలి. అంతేకాక మార్కెట్లో వడపావు సెంటర్లను ప్రాంచైజీ రూపంలో కూడా అందిస్తున్నారు.

Are-you-worried-about-not-having-a-job-this-is-for-you-investment-of-2-lakhs-earn-50-thousand-per-month

Are-you-worried-about-not-having-a-job-this-is-for-you-investment-of-2-lakhs-earn-50-thousand-per-month

అలా ప్రాంచైజీ లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ముందుగా వడపావు సెంటర్ కు కావలసిన పెట్టుబడి గురించి మాట్లాడుకుందాం. అయితే మొదటిసారి పెట్టుబడి పెడితే మెటీరియల్ తయారీ విధానం ముడి సరుకు అన్ని ప్రాంచైజీ వాళ్ళే అందిస్తారు. మీరు ఈజీగా వ్యాపారని మొదలు పెట్టుకోవచ్చు.ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. జనం ఎక్కువగా తిరిగే స్థలాల్లో ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం పొందే ఛాన్స్ ఉంటుంది. వడపావు ప్రాంచైజీ రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు అందుబాటులో ఉంది. అలాగే దీనికి సంబంధించిన కండిషన్స్ ను ముందే తెలుసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది. ఇక ఈ వ్యాపారంలో కనీసం నెలకు 50 వేల నుంచి లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.