Bigg Boss 7 : కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో…
Bigg Boss 7 : బిగ్ బాస్ ని ఎప్పుడు చూసినా కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరగడం తప్ప ఏముంది అనిపిస్తుంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 కూడా మొదటి వారం నుండే నామినేషన్స్ ఎలిమినేషన్స్ తో హాట్ హాట్ గా సాగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటికి నాలుగు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5వ వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు.ఈ క్రమంలోని తాజాగా విడుదలైన ప్రోమో హౌస్ లోని […]
Bigg Boss 7 : బిగ్ బాస్ ని ఎప్పుడు చూసినా కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరగడం తప్ప ఏముంది అనిపిస్తుంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 కూడా మొదటి వారం నుండే నామినేషన్స్ ఎలిమినేషన్స్ తో హాట్ హాట్ గా సాగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటికి నాలుగు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5వ వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు.ఈ క్రమంలోని తాజాగా విడుదలైన ప్రోమో హౌస్ లోని కంటెస్టెంట్స్ కి మరియు కుటుంబ సభ్యుల పట్ల ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో చూపించింది. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల కాగా దాంట్లో సీన్స్, ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే ప్రోమోలో ఏముందంటేే…
కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు అందించింది. అయితే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంట్లో వారు జోడి కట్టిన సంగతి తెలిసిందే . అలా జోడి కట్టిన వారిలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరో ఒకరు వారి ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందన్నమాట . దీంతో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఎమోషన్స్ సీన్స్ కనిపించాయి.ఇక దీనిలో అమర్ దీప్ తన భార్యను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.అమర్దీప్ మాట్లాడుతూ.. తేజు నేను నిన్ను బాగా చూసుకున్నానో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసి వచ్చాయి. తేజు ఐ యాం సో సారీ నీ విలువ నాకు తెలిసి వచ్చింది అంటూ అమర్ దీప్ బోరున ఏడ్చేశాడు.
అంటే ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ ను అమర్ త్యాగం చేసినట్లు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత శివాజీ మరియు రైతుబిడ్డ పల్లవి ప్రశంస మధ్య ఎమోషన్స్ నిండింది. ఈ క్రమంలో శివాజీ మాట్లాడుతూ….ఎక్కడో ఊరి నుండి వచ్చావు….అన్నా అంటూ హగ్ చేసుకున్నావు… నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. నేను నా లెటర్ ని త్యాగం చేస్తున్న. నా భార్యను నేను ఎంత బాగా చూసుకున్నానో తెలియదు కానీ నన్ను మాత్రం తను బాగా చూసుకుంటుంది. ఏం పర్లేదు నువ్వు నా మాట విను అంటూ పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ తన భార్య రాసిన లెటర్ ను త్యాగం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమో మాత్రం కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలను బాగా చూపించింది. కాగా ఈరోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ లో ఎవరెవరు లెటర్స్ త్యాగం చేశారో తెలుస్తుంది.