Bigg Boss 7 : వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్ళే….
Bigg Boss 7 : తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి అడుగుపెట్టి మూడు వారాలను కంప్లీట్ చేసింది. అయితే ఈ సీజన్ 14 మందిని హౌస్ లోపలికి పంపించిన బిగ్ బాస్ మొదటివారం కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసింది. అనంతరం షకీలా తర్వాత సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం […]
Bigg Boss 7 : తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి అడుగుపెట్టి మూడు వారాలను కంప్లీట్ చేసింది. అయితే ఈ సీజన్ 14 మందిని హౌస్ లోపలికి పంపించిన బిగ్ బాస్ మొదటివారం కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసింది. అనంతరం షకీలా తర్వాత సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. నాలుగో వారంలో పవర్ హస్త్ర సాధించేందుకు కంటెండర్ కావడానికి హౌస్ లోని సభ్యులకు టాస్కులు ఇస్తున్నడు బిగ్ బాస్. ఇక ఈ కంటెండర్ టాస్క్ లలో యావర్, శుభశ్రీ, ప్రశాంత్ నిలిచారు. ఇది ఇలా ఉండగా వచ్చేవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వైల్డ్ కార్డు ఏంటి దసరా స్పెషల్ ఎపిసోడ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. మరి వైల్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు రాబోతున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంజలి పవన్…
ఇటీవల నీతోనే డాన్స్ షో ద్వారా అంజలి మంచి పాపులారిటీ సాధించింది. ఇప్పటికే సంతోష్ పవన అనే నటుడిని పెళ్లి చేసుకున్న అంజలి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. మరి ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.
పూజా పూర్తి…
యాక్టర్ పూజ గుండమ్మ కథ సీరియల్ లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఈ సీరియల్ తో పాటు గతంలో కొన్ని కన్నడ సీరియల్స్ లో కూడా పూజ నటించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈమె కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.
యూట్యూబర్ కాస్కో నికిల్….
నిఖిల్ సోషల్ మీడియాలో యూట్యూబర్ గా చాలా పాపులర్. తన యూట్యూబ్లో కాస్కో అంటూ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు యూట్యూబ్ గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి వైట్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నాడు.
సింగర్ బోలె షావలి…
సింగర్ బోలే యూట్యూబర్ గా సింగర్ గా చాలా ఫేమస్ . మరి ముఖ్యంగా కష్టపడ్డ అనే పాటతో బాగా పాపులర్ అయ్యారు. అయితే ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా ,సింగర్ గా రానిస్తున్న బోలె షావలి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ 7 లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తేలుస్తోంది.
అర్జున్ అంబటి…
అగ్నిసాక్షి సీరియల్ లో నటించిన అర్జున్ అంబటి కొన్ని సినిమాల్లో కూడా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో మెప్పించాడు. ఇక ప్రస్తుతం దేవత సీరియల్ లో నటిస్తూ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం అర్జున్ కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉంది.