Nara Lokesh : నేడు లోకేష్ ను విచారించనున్న సిఐడి అధికారులు…

Nara Lokesh  : ఈరోజు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన మాదిరిగానే లోకేష్ ను కూడా చేస్తారన్న ప్రచారం తీవ్ర చర్చానియాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ తీవ్ర ఆందోళనలో ఉండగా నేడు […]

  • Published On:
Nara Lokesh : నేడు లోకేష్ ను విచారించనున్న సిఐడి అధికారులు…

Nara Lokesh  : ఈరోజు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన మాదిరిగానే లోకేష్ ను కూడా చేస్తారన్న ప్రచారం తీవ్ర చర్చానియాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ తీవ్ర ఆందోళనలో ఉండగా నేడు నారా లోకేష్ ను కూడా సిఐడి విచారించబోతోంది. ఇక ఈరోజు లోకేష్ సిఐడి విచారణకు హాజరు అవుతుండడంతో ఏం జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

today-the-cid-officers-will-interrogate-lokesh

అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో స్కామ్ జరిగిందని , ఇక దానిలో నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందని సిఐడి ఆరోపించడం జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో తన కుటుంబంతో పాటు హెరిటేజ్ సంస్థలకు లాభం చేకూరేలా ఐఆర్ఆర్ ఆన్లైన్ మెంట్ ను లోకేష్ మార్చినట్లుగా సిఐడి పేర్కొంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీలో ఉన్న లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది.

ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీలో పర్యటిస్తున్న నారా లోకేష్…సిఐడి నోటీసులను అందుకుని విచారణకు హాజరయ్యేందుకు సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లోకేష్ కు టిడిపి నేతలు స్వాగతం పలికారు. ఇక అక్కడ నుండి నేరుగా ఉండవల్లికి వెళ్లారు. ఇక ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు ను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.