Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకి బెయిల్ బయటికి రాగానే వార్నింగ్…

Kodi Kathi Srinu  : వైయస్సార్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై హత్య ప్రయత్నం కేసులో శ్రీనుకి హైకోర్టులో గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అప్పటి విపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ పై కోడి కత్తితో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ దాడికి పాల్పడ్డారు. ఇక ఈ కేస్ లో అరెస్ట్ అయిన అతడు అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. […]

  • Published On:
Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకి బెయిల్ బయటికి రాగానే వార్నింగ్…

Kodi Kathi Srinu  : వైయస్సార్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై హత్య ప్రయత్నం కేసులో శ్రీనుకి హైకోర్టులో గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అప్పటి విపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ పై కోడి కత్తితో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ దాడికి పాల్పడ్డారు. ఇక ఈ కేస్ లో అరెస్ట్ అయిన అతడు అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. తనకి బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు ఎన్ఐఏ కోర్ట్ ని అభ్యర్థించిన ఫలితం లేకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం అతనికి తాజాగా బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఎనిమిది సార్లు పిటిషన్ దాఖలు వేశాడు. హైకోర్టు లాయర్ పగడ సింధు మీడియాతో చెప్పారు.

జగన్ పై దాడి సమయంలో విశాఖ ఎయిర్ పోర్ట్ లో విధులు నిర్వహించిన అధికారి సాక్ష్యం చెప్పారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పలేదని వెల్లడించారు. మొదట ఈ కేసును విశాఖపట్నం కోర్టులో విచారణ చేశారని ఆ తర్వాత ఎన్ఐఏ పరిశోధనలోకి రావడంతో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కి బదిలీ చేశారని చెప్పారు. కొంతకాలం విశాఖపట్నంలో ఎన్ఐఏ కోర్టు పెట్టడం తో ఈ కేసును మరోసారి అక్కడికి బదిలీ చేశారని తెలిపారు. కాగా విశాఖ జైల్ నుంచి ఈ రోజు శ్రీనివాస్ విడుదల అయ్యే అవకాశం ఉంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు చేయాల్సిన చేయకూడని పనుల గురించి లాయర్ సింధు వివరించారు. షరతులు అతిక్రమిస్తే హైకోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అలాగే ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియాతో శ్రీనివాస్ మాట్లాడకూడదు. ఎలాంటి ర్యాలీలకి సభలకు వెళ్లరాదు. మాట్లాడరాదని రెండు షూరిటీలు ఇవ్వాలి. ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో ప్రతి ఆదివారం హాజరై సంతకం చేయాలి.