AP Elections : ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠత…గెలుపు ఎవరిదో తేల్చి చెప్పిన చాణక్య సర్వే..

AP Elections : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే 2024 ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారం సాధిస్తుందనేది తీవ్ర చర్చానియాంశంగా మారింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుండగా జగన్ ను గద్దె దించేందుకు జనసేన మరియు టిడిపి పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన కొన్ని సర్వేలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ […]

  • Published On:
AP Elections : ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠత…గెలుపు ఎవరిదో తేల్చి చెప్పిన చాణక్య సర్వే..

AP Elections : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే 2024 ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారం సాధిస్తుందనేది తీవ్ర చర్చానియాంశంగా మారింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుండగా జగన్ ను గద్దె దించేందుకు జనసేన మరియు టిడిపి పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన కొన్ని సర్వేలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా చాణిక్య స్ట్రాటజీ సర్వే ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయనే వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ సర్వే అందించిన సమాచారం ప్రకారం జనసేన మరియు టిడిపి కూటమిగా ఏర్పడడం వలన ఏకంగా 115 నుండి 128 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు తేల్చి చెప్పింది.

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి కేవలం 42 నుండి 55 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం 18 సీట్లలో పోరా హోరి పోటీ ఉండనున్నట్లు ఈ సర్వే తెలియజేసింది. ఇక ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుండి 7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చాణక్య స్ట్రేటజీ సర్వే తెలియజేసింది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇండిపెండెంట్ కి సీట్లు వచ్చిన దాఖలాలు లేవు.కానీ తాజాగా వెల్లడించిన ఈ సర్వేలో మాత్రం ఇండిపెండెన్స్ కి ఏకంగా 7 సీట్లు వస్తాయని తెలియజేస్తోంది. అలాగే మొత్తం ఉన్న175 సీట్లలో 115 నుండి 128 సీట్లు కూటమికే వస్తాయని ,దీంతో 2024లో టిడిపి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సర్వే చెబుతుంది. అయితే సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం చూసినట్లయితే

  • శ్రీకాకుళంలో 10 సీట్లకు – టిడిపి  జనసేన కూటమి  – 8 , వైసీపీ – 2
  • విజయనగరంలో టిడిపి -4 వైసీపీకి – 4
  • విశాఖపట్నంలో టీడీపీ – 11 వైసీపీ – 2
  • తూర్పుగోదావరిలో 19 లో టీడీపీ – 16 , వైసీపీ – 2
  • పశ్చిమగోదావరిలో టీడీపీ – 12, వైసీపీ – 2 ,
  • కృష్ణాజిల్లాలో 16లో టిడిపి – 12 వైసీపీ – 2
  • గుంటూరులో 17 లో టిడిపి – 12 వైసీపీ – 5
  • ప్రకాశం జిల్లాలో 12 లో టిడిపి- 12 వైసీపీ – 3
  • నెల్లూరులో 10 లో టిడిపి – 6 వైసీపీ – 4

ఇక పార్టీల వారీగా చూసుకున్నట్లయితే టిడిపికి 43% , వైసీపీకి 41 % , జనసేనకు 10% ఓట్ ర్యాంకు రాబోతుందని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఇతరులకు కూడా 6% ఓట్ ర్యాంక్ రాబోతుందని సర్వే తెలిపింది. అయితే చాణిక్య స్ట్రాటజీ సర్వే అందించిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టిడిపి మరియు జనసేన గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అది కూడా ఎవరు ఊహించినంతా అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టిడిపి మరియు జనసేన పొత్తు లేకపోతే మాత్రం టిడిపి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ మధ్య గట్టి పోటీ నడిచేది . కానీ జనసేన మరియు టిడిపి కూటమిగా ఏర్పడడం వలన టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.