Chandra Babu Naidu : పొటాటోకి టమాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్…చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…

Chandra Babu Naidu : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు” రా కదిలిరా ” అనే నినాదంతో పార్టీ ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నంద్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా విమర్శలు చేయసాగారు. జగన్ ఇంట్లో జరిగే గొడవలకు […]

  • Published On:
Chandra Babu Naidu : పొటాటోకి టమాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్…చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…

Chandra Babu Naidu : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు” రా కదిలిరా ” అనే నినాదంతో పార్టీ ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నంద్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా విమర్శలు చేయసాగారు. జగన్ ఇంట్లో జరిగే గొడవలకు మాకు ఏం సంబంధం అని జగన్ వదిలిన బాణం తిరిగి జగన్ కే రివర్స్ అయిందని , అప్పుడు జగన్ కోసం రాష్ట్రమంతా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ గా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ తన ఇంట్లో తానే స్వయంగా చిచ్చు పెట్టుకున్నాడని , ఇక ఇప్పుడు వాటిని మాపై రుద్దుతూ మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల జగనన్న అంటూ రాష్ట్రమంతా తిరిగింది. కానీ ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటూ చెప్పుకోచ్చారు. ప్రతి కుటుంబంలో ఆడబిడ్డను అన్ని విధాలుగా ఆదుకుంటారు , ఆస్తి పంపకాల విషయంలో కూడా వారికి లోటు చేయరు , అది మన సాంప్రదాయం.

 

కానీ మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన చెల్లి షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని , అందుకే ఇప్పుడు ఆమె జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారంటూ చంద్రబాబు తెలియజేశారు. అయిన అది వారింట్లో సమస్య దానికి మాకు సంబంధం ఏంటి మాపై పడి ఏడవటం ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. అదేవిధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు నేను చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళం. రాజకీయపరంగా మేము విరోధులు అయినప్పటికీ మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళం. ఇక ఆయన తమ్ముడు వివేకానంద తన అన్న మాటను అస్సలు జవదాటే వాడు కాదు. అలాంటి వాడిని వైయస్ జగన్ బాబాయి అని కూడా చూడకుండా హత్య చేశాడు అంటూ జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేయసాగాడు. సైకో జగన్ పోవాలంటే ప్రజలంతా కదిలి రావాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అన్ని విధాలుగా వెనక్కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే ప్రజలందరూ కదలి రావాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

జగన్ పాలంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని దాన్ని కాపాడుకునే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తప్పనిసరి అని లేకుంటే మహిళలు మరికొన్ని ఇబ్బందులు పడతారని నిత్యవసర ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని చంద్రబాబు తెలియజేశాడు. టమాటాకు పొటాటో కు తేడా తెలియని జగన్ మన ముఖ్యమంత్రి నా అని ఏద్దీవా చేశారు. అదేవిధంగా మూడు రాజధానుల పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా తాను అధికారంలో ఉన్నప్పుడు సైదరాబాద్ ను డెవలప్ చేయడం వలన ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అయిందని కానీ మన జగన్ రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించాడని చెప్పుకొచ్చాడు. తాము అధికారంలోకి వస్తే మొదట అమరావతిని రాజధాని చేస్తానని భవిష్యత్ తరాలకు గ్యారెంటీతో సూపర్ సిక్స్ అందిస్తానని హామీ ఇచ్చాడు. సైకో జగన్ ను ఎలాగైనా గద్దె దించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చాడు.