Chandrababu Naidu Letter : జైలు నుండి చంద్రబాబు లేఖ…వైరల్ న్యూస్…

Chandrababu Naidu Letter : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు భద్రత ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జ్ కి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర చర్చనియాంశంగా మారింది. అయితే ఈ విషయంపై టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చేందుకు చంద్రబాబు మరో కొత్త డ్రామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే […]

  • Published On:
Chandrababu Naidu Letter : జైలు నుండి చంద్రబాబు లేఖ…వైరల్ న్యూస్…

Chandrababu Naidu Letter : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు భద్రత ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జ్ కి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర చర్చనియాంశంగా మారింది. అయితే ఈ విషయంపై టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చేందుకు చంద్రబాబు మరో కొత్త డ్రామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు భద్రతపై రాజమండ్రి జైలు శాఖ డిఐజి రవికిరణ్ కీలక వ్యాఖ్యలలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకి మొదటి నుండి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశామని తెలియజేశారు.

chandrababu-naidu-letter-to-acb-court-judge

అంతేకాక చంద్రబాబు ఉన్న రూమ్ లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు వాటిని పర్యావేక్షిస్తున్నామని తెలిపారు. అలాగే మావోయిస్టు పార్టీ నుండి చంద్రబాబుకు లెటర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మేము విచారణ చేసాం.అది ఒక ఫేక్ లెటర్ మాత్రమే.చంద్రబాబుకు సంబంధించి ఎలాంటి బెదిరింపు లెటర్స్ రాలేదని వారి విచారణలో తేలినట్లుగా డీఐజీ తెలిపారు. ఇక జైలు నుండి చంద్రబాబు లెటర్ బయటకు వెళ్లిందనే దానిని జైలు అధికారులు అటెన్షన్ చేయలేదని తెలిపారు. అలాగే చంద్రబాబు కుడి కంటి ఆపరేషన్ కు సంబంధించి రాజమండ్రి జిజిహెచ్ వైద్యులను కూడా సంప్రదించి పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు.

chandrababu-naidu-letter-to-acb-court-judge

ఇక ఈ పరీక్షలలో అమౌచుర్ కేటారా ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపినట్లు తెలియజేశారు.అదేవిధంగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎలాంటి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం లేదని డిఐజి స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు పంపుతున్నామన్నారు. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వారు తెలియజేస్తున్నారు.ఇక చంద్రబాబుకు సంబంధించి గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు తెలియజేశారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా మేము లెటర్ లో రాయడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యనికి సంబంధించి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో తెలియజేయవలసిందిగా నారా భువనేశ్వరి కి కూడా తెలిపినట్లు వారు తేలియజేశారు.