Tirumala Temple : చాలా రోజుల తర్వాత తిరుమల హుండీకి భారీ మొత్తంలో ఆదాయం…ఎంతో తెలిస్తే షేక్ అవాల్సిందే…

Tirumala Temple  : తిరుమల తిరుపతి శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత భారీ మొత్తంలో ఆదాయం వచ్చి పడింది. తాజాగా సోమవారం రోజు 64,882 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే…దాదాపు 5.28 కోట్ల రూపాయలు హుండికి వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. అలాగే 24,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టైం స్లాట్ సర్వ దర్శనం టికెట్లేనివారికి దర్శనం కోసం […]

  • Published On:
Tirumala Temple  : చాలా రోజుల తర్వాత తిరుమల హుండీకి భారీ మొత్తంలో ఆదాయం…ఎంతో తెలిస్తే షేక్ అవాల్సిందే…

Tirumala Temple  : తిరుమల తిరుపతి శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత భారీ మొత్తంలో ఆదాయం వచ్చి పడింది. తాజాగా సోమవారం రోజు 64,882 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే…దాదాపు 5.28 కోట్ల రూపాయలు హుండికి వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. అలాగే 24,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టైం స్లాట్ సర్వ దర్శనం టికెట్లేనివారికి దర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అయితే తిరుమల శ్రీవారికి దాదాపు రెండు మూడు నెలల నుండి రోజువారి ఆదాయం 5 కోట్లు దాటలేదు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం రోజు ఆ మార్క్ ను అధిగమించింది.

after-many-days-tirumala-hundi-got-a-huge-amount-of-income

ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ధనుర్మాసం సందర్భంగా 2023 డిసెంబర్ 17 నుండి 2024 జనవరి 14 వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి మటంలో తిరుప్పావై పారాయణం జరగనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కెల్వి అప్పన్ శతగోప రామానుజ పెద్ద జీయర్ స్వామి మఠంలో దాదాపు నెల రోజులపాటు ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేయడం జరుగుతుంది. ఇక ఈ పారాయన కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు చూపించనున్నారు.