Ayodhya : అయోధ్య రామునికి కొత్త పేరు…ఇకనుండి అలాగే పిలవాలి…

Ayodhya ; అయోధ్య లోని రామ మందిరంలో జనవరి 22న కొలువుదీరిన బాలరాముడు ఇకనుండి బాలక్ రామ్ గారి దర్శనం ఇవ్వనున్నాడు. ఇక ఈ విషయాన్ని ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలియజేయడం జరిగింది. అయితే రామ మందిరంలో కొలువు దీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసి బాలుడుగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన పేరును బాలక్ రామ్ గా నిర్ణయించినట్లు తెలియజేశారు. అంతేకాక ఆలయాన్ని కూడా బాలిక రామ్ మందిర్ గా నామకరణం […]

  • Published On:
Ayodhya : అయోధ్య రామునికి కొత్త పేరు…ఇకనుండి అలాగే పిలవాలి…

Ayodhya ; అయోధ్య లోని రామ మందిరంలో జనవరి 22న కొలువుదీరిన బాలరాముడు ఇకనుండి బాలక్ రామ్ గారి దర్శనం ఇవ్వనున్నాడు. ఇక ఈ విషయాన్ని ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలియజేయడం జరిగింది. అయితే రామ మందిరంలో కొలువు దీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసి బాలుడుగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన పేరును బాలక్ రామ్ గా నిర్ణయించినట్లు తెలియజేశారు. అంతేకాక ఆలయాన్ని కూడా బాలిక రామ్ మందిర్ గా నామకరణం చేసినట్లు తెలిపారు.

అయితే భారతదేశంలోని ప్రతి హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది హిందువులు అనేక రకాల మాధ్యమాల ద్వారా వీక్షించారు. ఇక ఈ కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. అయితే అక్కడ కొలువుతీరిన రాముడిని ఇప్పటివరకు రామ్ లల్లా అని పిలిచేవారు.కానీ ఇప్పుడు ఆ బాల రాముడి పేరు మార్చారు.

ప్రస్తుతం రామ మందిరంలో కొలువు తీరిన శ్రీరాముడు ఐదేళ్ల బాలుడి రూపంలో దర్శనమిస్తున్నాడని..కాబట్టి బాలక్ రామ్ అనే పేరును ఖరారు చేసినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాక ఇప్పటినుండి ఆలయాన్ని కూడా బాలక్ రామ్ మందిర్ అని పిలుస్తామని వెల్లడించారు.ఇక ఈ ఆలయంలో స్వామికి రోజు ఆరుసార్లు ఆరతిని ఇస్తారని ఆలయ ట్రస్ట్ నిర్వహకులు ఆచార్య మితిలేవు నందిని తెలియజేశారు.మంగళ ,శ్రింగార, భోగ ఉతపన్ , సంధ్య, శయన వంటి హారతి ఇస్తారని చెప్పుకొచ్చారు.ఇక ఇక్కడ పూరి కూరతో పాటు పాలు, పండ్లు ,రబ్ డీ ఖీర్ , అలాగే పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తారని వారు తెలియజేశారు.