Rythu Bandhu : రైతుబంధు ఆలస్యానికి కారణమేంటి…

Rythu Bandhu  : తాజాగా మంగళవారం అసెంబ్లీలో మీడియాతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో విడతల వారీగా జమ చేస్తున్నామని తెలియజేశారు. రైతులకు ఆర్థిక సాయం అందించే దిశగా రైతుబంధు నిధులను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎకరం భూమి ఉన్న 27 లక్షల మంది రైతులు రైతుబంధు నిధులను అందుకున్నారని తెలియజేశాడు. ఇక ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతుబంధు నిధులు విడుదల […]

  • Published On:
Rythu Bandhu  : రైతుబంధు ఆలస్యానికి కారణమేంటి…

Rythu Bandhu  : తాజాగా మంగళవారం అసెంబ్లీలో మీడియాతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో విడతల వారీగా జమ చేస్తున్నామని తెలియజేశారు. రైతులకు ఆర్థిక సాయం అందించే దిశగా రైతుబంధు నిధులను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎకరం భూమి ఉన్న 27 లక్షల మంది రైతులు రైతుబంధు నిధులను అందుకున్నారని తెలియజేశాడు. ఇక ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుబంధు నిధులు ఆయా రైతుల ఖాతాలో జమ అవుతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే రైతులందరికీ ఒకేసారి నిధులు జమ చేయడానికి ప్రస్తుతం నిధుల కొరత అడ్డుగా మారిందని ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నట్లుగా తెలియజేశారు.

వాస్తవానికి ఎన్నికల ముందే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని టిఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆరోజు ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాల్లో చేరాల్సిన డబ్బు షెడ్యూల్ మారింది. ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు ముగిసిన తర్వాత చేసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అయితే రైతుబంధు కోసం ఖాతాలలో జమ అయిన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబంధు డబ్బులు డిసెంబర్ 9న జమ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి కి ఖజానా ఖాళీగా కనిపించింది. ఆర్థిక శాఖ అధికారులు కూడా నయా పైసా కూడా లేదు సార్ అంటూ రేవంత్ రెడ్డికి సమాధానం ఇచ్చారట. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాలి.

అయితే రైతుబంధు కోసం జమ చేసిన సొమ్మును అనుకూల కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం చెల్లించినట్లుగా కాంగ్రెస్ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చిన ఆదాయంతోనే రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్రం నుండి కొంత అప్పు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుందట. మరి కేంద్రం కనికరిస్తే రైతుబంధు నిధులతో సహా ఇతర పథకాలకు కావాల్సిన నిధుల కొరత ఉండదు. అలాగే రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయంలో రైతుబంధుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి రైతు ఖాతాలో నిధులు జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుందట. ఇక ప్రస్తుతం ఎకరం రైతులకు రైతుబంధు ఇవ్వక రెండు ఎకరాలు రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇలా విడతల వారీగా రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు.