Amala Paul : పెళ్లయిన రెండు నెలలకే గర్భవతి అయిన అమలాపాల్…
Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అమలాపాల్ సినిమాల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం అతని పెళ్లి కూడా చేసుకుంది. అయితే అమలాపాల్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే రెండు నెలల క్రితం గోవాకి […]
Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అమలాపాల్ సినిమాల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం అతని పెళ్లి కూడా చేసుకుంది. అయితే అమలాపాల్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే రెండు నెలల క్రితం గోవాకి చెందిన జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమలాపాల్ రెండో వివాహం చేస్తుంది.
అక్టోబర్ నెలలో ప్రియుడిని పరిచయం చేసిన అమలాపాల్ వెంటనే నవంబర్ లో పెళ్లి చేసుకుంది. అయితే ఇదే ఆశ్చర్యం అని అనుకుంటున్నా అభిమానులకు ఆమె మరో గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అమలాపాల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులకు తెలియజేసింది. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. వారి జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు అంటూ తెలియజేసింది. వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు త్రీ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లు అర్థమవుతుంది.ఈ నేపథ్యంలోనే తన బెల్లీ ఫ్యాట్ ను చూపిస్తూ పలు ఆసక్తికరమైన ఫోటోలను అమలాపాల్ పంచుకుంది.
ఇక ఈ ఫోటోలో తన భర్త జగత్ దేశాయ్ అమలాపాల్ గర్భాన్ని పట్టుకొని చూపిస్తున్నట్లుగా ఫోటో దిగారు. అదేవిధంగా మరో ఫోటోలో జగత్ దేశాయి గుండె లోపల అమలాపాల్ ఉన్నట్లుగా చూపించారు. అలాగే సముద్ర తీరంలో భార్య భర్తలు దిగిన ఆఫ్ కట్ ఫోటోని కూడా అమలాపాల్ షేర్ చేసింది. అయితే అమలాపాల్ పోస్ట్ చేసిన ఫోటోల పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మరికొందరు పెళ్లి జరిగి రెండు నెలలే అవుతుంది అప్పుడే గర్భవతా అంటూ ఆశ్చర్యపో తున్నారు. ఇదేదో తేడాగా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమలాపాల్ అభిమానులు మాత్రం పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటూ అమలాపాల్ కు విషెస్ తెలియజేస్తున్నారు.
View this post on Instagram