Revanth Reddy VS KTR : నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి వాదనలు…దద్దరిల్లిన అసెంబ్లీ…

Revanth Reddy VS KTR  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా ఘాటుగా ప్రారంభమయ్యాయి. కేటీఆర్ చేసిన విమర్శలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా కేటీఆర్ ఈ మేనేజ్మెంట్ కోటాలోకి వచ్చారంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశాడు. అలాగే కేకే మహేందర్ రెడ్డి కి అన్యాయం జరిగిందని […]

  • Published On:
Revanth Reddy VS KTR : నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి వాదనలు…దద్దరిల్లిన అసెంబ్లీ…

Revanth Reddy VS KTR  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా ఘాటుగా ప్రారంభమయ్యాయి. కేటీఆర్ చేసిన విమర్శలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా కేటీఆర్ ఈ మేనేజ్మెంట్ కోటాలోకి వచ్చారంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశాడు. అలాగే కేకే మహేందర్ రెడ్డి కి అన్యాయం జరిగిందని పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య విలువ తెలియదని ఇంకా ఐదేళ్ల సమయం ఉందని జరిగిన విధ్వంసాన్ని కచ్చితంగా బయట పెడతానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. అలాగే కేటీఆర్ కు రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలియజేశారు. అంతేకాక కేటీఆర్ కు ఎంపీగా కేంద్ర మంత్రిగా పదవులు కట్టబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకోచ్చారు.

అలాగే వై.యస్.ఆర్ రాజశేఖర్ రెడ్డి పాలనలో కెసిఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చేశారని తెలియజేశారు. అయితే గతం గురించి చర్చించుకోవాలంటే కచ్చితంగా ఒకరోజు సమయం ఇవ్వాలని అన్ని లెక్కలు తీద్దామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే టిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై కచ్చితంగా ఎక్స్ ఇస్తానని ప్రతిపక్షాలను గౌరవించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందంటూ రేవంత్ అన్నారు. అయితే అంతకుముందు కేటీఆర్ కామెంట్ లపై డిప్యూటీ సీఎం బట్టి మరియు మంత్రి పొన్నం కూడా కౌంటర్లు వేశారు. అయితే కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు చేశారు… ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాటలకు స్పందిస్తూ కేటీఆర్ మాట్లాడారు… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా గౌరవంగా మాట్లాడుతారు అనుకున్న కానీ కొన్ని విషయాలను అసలు ఊహించలేం.

ఎందుకంటే అది వారికి సాధ్యం కాదు. తెలంగాణను పోరాడి తీసుకొచ్చిన నాయకుని కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ఏక వచనంతో పిలవడంవారికి ప్రతిపక్షాలపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని , అలాగే తెలంగాణ రాకుండా ఉండేందుకు వ్యతిరేకించిన వారిని గారు అంటూ మర్యాదగా పిలుస్తున్నారు అంటూ తెలియజేశారు. దీంతో వారి సంస్కారం ఏంటో అర్థమైందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న బట్టి అన్న , శ్రీధర్ బాబు , దామోదర్ అన్న ఉత్తంకుమార్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వీరంతా ఎప్పటినుంచో కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ మధ్యలో వచ్చి దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అని మాట్లాడ్డం సరికాదని తెలియజేశారు. అలాగే ఎన్నారై లను నాన్ రిలేబుల్ అన్నారు. ఇక ఎన్నారై టికెట్లను అమ్ముకుంది కూడా వారే కదా అంటూ కేటీఆర్ మాటకు మాట సమాధానం ఇచ్చారు. దీంతో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ సర్కార్ మరియు బిజెపి సర్కార్ మధ్య తగ్గేదేలే అన్న రీతిలో వ్యాఖ్యలు జరిగాయి.