Viral Video : టమాటా రేట్ పెరగడం ఏమో కానీ…వీరి కంటెంట్ క్రియేషన్ మాత్రం వేరే లెవెల్…ఒకసారి మీరే చూడండి….

Viral Video  : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్న టాపిక్ టమాటా ధరలు. రోజురోజుకు మితిమీరిపోతున్న టమాటా ధరలు సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. మనదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు టమాటో ధర కిలో ₹100 గానే ఉంది. కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువకే అమ్ముతున్నారు. దీంతో మార్కెట్లో టమాటా వినియోగం చాలా తగ్గిపోయింది. మార్కెట్లో కూడా టమాటాలు ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టమాటా ధరలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. […]

  • Published On:
Viral Video : టమాటా రేట్ పెరగడం ఏమో కానీ…వీరి కంటెంట్ క్రియేషన్ మాత్రం వేరే లెవెల్…ఒకసారి మీరే చూడండి….

Viral Video  : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్న టాపిక్ టమాటా ధరలు. రోజురోజుకు మితిమీరిపోతున్న టమాటా ధరలు సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. మనదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు టమాటో ధర కిలో ₹100 గానే ఉంది. కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువకే అమ్ముతున్నారు. దీంతో మార్కెట్లో టమాటా వినియోగం చాలా తగ్గిపోయింది. మార్కెట్లో కూడా టమాటాలు ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టమాటా ధరలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

టమాట ధరలు పెరగడంతో మీమర్స్ ,రకరకాల మీన్స్ ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టమాట ధరలు పెరగడం ఏమో కానీ వీరి కంటెంట్ క్రియేషన్ మాత్రం ,అదరహో అనిపిస్తుంది. అయితే ఇటీవల ఈ టమాటా ధరలపై కంటెంట్ క్రియేటర్ కుషాల్ అనే వ్యక్తి ఓ పేరడీ సాంగ్ రూపొందించాడు. ఇక ఆ పేరడీ సాంగ్ ను ఆధారంగా చేసుకుని ఒక వీడియోను షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా సూపర్ డూపర్ హిట్ అయింది.  ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేసిన క్షణాల వ్యవధిలోని 4.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఇక ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది ఈ వీడియోని లైక్ చేశారు. ఇక ఈ వీడియోకు వచ్చి కామెంట్స్ అయితే మాటల్లో చెప్పనక్కర్లేదు. ఎంతోమంది ఈ వీడియోని చూసి ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో టమాట రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను అర్థమయ్యేలా కుషాల్ వర్ణించాడు. సాంబార్ నుండి పావుభాజీ వరకు టమాటా లేనిదే ఏ వంటకం పూర్తి కాదని పేరడి సాంగ్ రూపొందించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నేటిజనులు టమాట కష్టాలను చాలా అద్భుతంగా వర్ణించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Khushaal (@khushaal_pawaar)