Viral Video : సోదరా భావం చాటుకున్న శునకం….గుంతలో పడిన తన స్నేహితుడిని కాపాడుకునేందుకు ఏం చేసింది మీరే చూడండి…

Viral Video : మనం ప్రతిరోజు కలిసి తిరిగే స్నేహితులకి లేదా సహచరులకు ఏదైనా అయితే ఆ సంఘటన చూసి మనం అస్సలు తట్టుకోలేం. ఎలాగైనా వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఇతరుల సహాయాన్ని తీసుకునైనా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ గుణం కేవలం మనుషులకే కాదు కుక్కలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది. అయితే వైరల్ […]

  • Published On:
Viral Video : సోదరా భావం చాటుకున్న శునకం….గుంతలో పడిన తన స్నేహితుడిని కాపాడుకునేందుకు ఏం చేసింది మీరే చూడండి…

Viral Video : మనం ప్రతిరోజు కలిసి తిరిగే స్నేహితులకి లేదా సహచరులకు ఏదైనా అయితే ఆ సంఘటన చూసి మనం అస్సలు తట్టుకోలేం. ఎలాగైనా వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఇతరుల సహాయాన్ని తీసుకునైనా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ గుణం కేవలం మనుషులకే కాదు కుక్కలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క తన తోటి కుక్కను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అనుకోకుండా గుంతలో పడిపోయిన తన స్నేహితుని కాపాడేందుకు ఆ కుక్క మనిషి సహాయం కోరింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియో ను @Yoda4ever అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రెండు కుక్కల సరదాగా ఆడుకుంటూ వస్తున్నాయి. అటు ఇటు పరిగెడుతూ రావడంతో ఓ కుక్క అనుకోకుండా గొడ పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. ఇది గమనించిన రెండో కుక్క ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురుచూస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తుంటే తన స్నేహితుడికి సహాయం చేయమని కుక్క అతని చుట్టూ తిరుగుతూ తనకు అర్థమయ్యేలా చేసింది.

అయితే ఆ కుక్క అలా ఎందుకు చేస్తుందో మొదట ఆ వ్యక్తికి అర్థం కాలేదు. కానీ ఇంతలో గుంత లో నుండి మరో కుక్క అరుపులు వినిపించి అర్థం చేసుకున్నాడు. గుంత దగ్గరికి వెళ్లి చూడగా అందులో కుక్క కనిపించింది. వెంటనే అందులోకి దిగి దానిని బయటకు తీశాడు. దీంతో ఆ రెండు కుక్కలు కలుసుకుని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా అతని చుట్టూ తిరిగాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 1.70 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నిరసనలు వాటి సోదర భావానికి ఫిదా అవుతున్నారు. నిజంగా మనుషుల మధ్య కూడా ఇలాంటి అనుబంధం ఉండదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.