Viral Video : ట్రాఫిక్ చలానా నుండి తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేసాడో చూడండి…మరి ఇంత సాహసమా…

Viral Video : ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే. ఇక దీనిని ఎవరు కూడా తమ చేతి నుండి చేజార్చుకోవాలి అనుకోరు. కానీ కొన్నిసార్లు తెలియకుండా జరిగే కొన్ని తప్పిదాల వలన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఓ వ్యక్తి ట్రాఫిక్ నియమాలను ముల్లంగించాడనే నేరంపై ట్రాఫిక్ అధికారులు వ్యక్తి కారు ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చలానా కట్టిన తర్వాత కారును తీసుకెళ్లాలంటూ అధికారులు అతనికి వార్నింగ్ ఇచ్చారు. […]

  • Published On:
Viral Video : ట్రాఫిక్ చలానా నుండి తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేసాడో చూడండి…మరి ఇంత సాహసమా…

Viral Video : ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే. ఇక దీనిని ఎవరు కూడా తమ చేతి నుండి చేజార్చుకోవాలి అనుకోరు. కానీ కొన్నిసార్లు తెలియకుండా జరిగే కొన్ని తప్పిదాల వలన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఓ వ్యక్తి ట్రాఫిక్ నియమాలను ముల్లంగించాడనే నేరంపై ట్రాఫిక్ అధికారులు వ్యక్తి కారు ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చలానా కట్టిన తర్వాత కారును తీసుకెళ్లాలంటూ అధికారులు అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆ కారు ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళేందుకు ఓ ట్రక్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ట్రాఫిక్ చలానా కట్టేందుకు అసలు ఆసక్తి చూపలేదు.

ఎలాగైనా అధికారుల నుండి కారు ను తీసుకునేందుకు ప్లాన్ చేశాడు. వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. ఇక పోలీసు అధికారులు కారు ను స్టేషన్ కు తీసుకువెళ్తుంటే ఆ ట్రక్కును ఫాలో అయ్యాడు. ఇక ఆ ట్రక్ హైవే పై కు వెళ్ళగానే కారు ను ట్రక్ దగ్గరకు పోనించి, వ్యక్తి తన ఫ్రెండ్ కారు విండో లో నుండి ట్రక్కు మీదకు చేరుకున్నాడు. తన దగ్గర ఉన్న మరొక కీస్ తో సహాయంతో ట్రక్ పై ఉన్న కారు ను స్టార్ట్ చేశాడు. కదులుతున్న ట్రక్ నుండి డైరెక్ట్ గా కారు ను రోడ్డుపైకి దింపాడు. అయితే అతను ట్రక్కు లో ఉన్న కారును తీసుకెళ్తున్న సంగతి ట్రక్కులో ఉన్న వారికి కూడా తెలియదు.

చలానా నుండి తప్పించుకునేందుకు ఈ వ్యక్తి ఏకంగా తన ప్రాణాలను పణంగా పెట్టేసాడు. అయితే ఈ తతంగం మొత్తాన్ని ఫ్రెండ్ కారు లో వెనక సీట్ లో ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి తెలివి రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా పోలీసు అధికారులు నుండి అసలు వారికి తెలియకుండా కారును తీసుకెళ్తున్నారంటే వీడి గుండె మామూలు గుండె కాదురా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.