Viral Video : జంతువులకు కూడా స్నేహ భావం ఉంటుందని తెలిపే వీడియో….చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Viral Video : మనం నివసించే ప్రదేశాలలో ఇరుగుపొరుగు వారికి గొడవలైన వారి పిల్లలు మాత్రం వాటిని పట్టించుకోకుండా స్నేహభావంతో కలిసి మెలిసి తిరుగుతుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయితే ఇలాంటి అనుభవం జంతువులకు కూడా ఉంటుందంటే నమ్ముతారా..ఈ వీడియో చూస్తే నమ్మక తప్పదు మరి. ఇలాంటిదే ఇప్పుడు జంతువులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అవి సాదాసీదా జంతువులు అయితే కాదు. క్రూర మృగాలుగా పేరుపొందిన […]

  • Published On:
Viral Video : జంతువులకు కూడా స్నేహ భావం ఉంటుందని తెలిపే వీడియో….చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Viral Video : మనం నివసించే ప్రదేశాలలో ఇరుగుపొరుగు వారికి గొడవలైన వారి పిల్లలు మాత్రం వాటిని పట్టించుకోకుండా స్నేహభావంతో కలిసి మెలిసి తిరుగుతుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయితే ఇలాంటి అనుభవం జంతువులకు కూడా ఉంటుందంటే నమ్ముతారా..ఈ వీడియో చూస్తే నమ్మక తప్పదు మరి. ఇలాంటిదే ఇప్పుడు జంతువులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అవి సాదాసీదా జంతువులు అయితే కాదు. క్రూర మృగాలుగా పేరుపొందిన పులి మరియు ఎలుగు పిల్లలు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి పులి పిల్ల మరియు ఎలుగు పిల్ల ఆడుకుంటున్నాయి. పులి పిల్లను ఎలుగు పిల్ల కౌగిలించుకోవాలని చూస్తుంటే…పులి పిల్ల మాత్రం దానిని కాలితో నెట్టేస్తుంది. అయితే కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే ఉన్న ఈ వీడియో జంతు ప్రేమలకు విపరీతంగా నచ్చేసింది . ఈ వీడియో చూసిన కొందరు క్రూర మృగాలలో కూడా స్నేహభావం అనేది ఉంటుందని, దానిని గ్రహించడమే చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ రెండు పిల్లలకు షేర్ ఖాన్ మరియు బల్లు అంటూ పేర్లు పెట్టి వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ వీడియోలో కేవలం రెండు పిల్లలు మాత్రమే ఉండడంతో అవి తప్పిపోయాయా ఏంటి అంటూ మరికొందరు అడుగుతున్నారు. ఇక ఈ వీడియోను బియర్ ఛానల్ అనే ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నేటిజనులు క్యూట్ పప్పీస్ అంటూ ఎమోజీలను షేర్ చేస్తున్నాను. దీంతో ఇప్పటివరకు దాదాపుగా ఈ వీడియోకు 90 వేల లైక్స్ మరియు లక్షలలో వ్యూస్ వచ్చి పడ్డాయి.

 

View this post on Instagram

 

A post shared by bear.chanel (@bear.chanel)