Viral Video : ఈమె ధైర్యానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే….ఒకేసారి రెండు పాములను ఎలా పట్టుకుందో చూడండి..

Viral Video : ఈ భూమి మీద మనుషులను ఎక్కువగా భయపెట్టేది పాములే అని చెప్పాలి. విషపూరిత పాములను చూస్తే ఎలాంటి వారైనా వనికిపోతారు. పాములు ఉన్నాయని తెలిస్తే కొందరు అసలు అటువైపు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అయితే నేటి కాలంలో పాములే జననివాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ వీడియో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే పాములు అంటే చాలామందికి […]

  • Published On:
Viral Video : ఈమె ధైర్యానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే….ఒకేసారి రెండు పాములను ఎలా పట్టుకుందో చూడండి..

Viral Video : ఈ భూమి మీద మనుషులను ఎక్కువగా భయపెట్టేది పాములే అని చెప్పాలి. విషపూరిత పాములను చూస్తే ఎలాంటి వారైనా వనికిపోతారు. పాములు ఉన్నాయని తెలిస్తే కొందరు అసలు అటువైపు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అయితే నేటి కాలంలో పాములే జననివాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ వీడియో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అయితే పాములు అంటే చాలామందికి భయం ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. అయితే అలాంటిదే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతీ కాలువ దగ్గర నిలుచుని ఉంది. ఇక కాలువలో రెండు పాములు కనిపించడంతో, ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా కాలువలోకి దిగి మరి వాటిని పట్టుకుంది. తన రెండు చేతులతో రెండు పాములను పట్టుకుని బయటకు లాగుతుంది.

వాటిలో ఓ పాము యువతీ చేతి నుంచి తప్పించుకోగా మరలా వెతికి మరి దానిని పట్టుకుంది యువతి. ఇక ఈ వీడియోను @HasnaZarooriHai అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో చూసిన నేటిజనులు యువతి సాహసానికి ఆశ్చర్యపోతున్నారు. మగవారు కూడా ఈ విధంగా పాములను పట్టుకోలేరేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ధైర్య సాహసాలు ప్రతి మహిళలో ఉంటే చాలా బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ యువతి యొక్క గుండె ధైర్యానికి ప్రతి ఒక్కరు హాండ్స్ ఆఫ్ చెబుతున్నారు.

https://twitter.com/HasnaZarooriHai/status/1662142425375342592