Trisha : త్రిష కొత్త ఇల్లు ఎక్కడుందో తెలుసా ..? ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే !

Trisha : టాలీవుడ్ లో తరుణ్ హీరోగా నటించిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది త్రిష. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ వర్షం ‘ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి […]

  • Published On:
Trisha : త్రిష కొత్త ఇల్లు ఎక్కడుందో తెలుసా ..?  ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే !

Trisha : టాలీవుడ్ లో తరుణ్ హీరోగా నటించిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది త్రిష. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ వర్షం ‘ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి ఫుల్ పాపులర్ అయింది. స్టార్ హీరో రేంజ్కి ఎదిగిన త్రిష తెలుగు తమిళ్ మలయాళం భాషలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా లో త్రిష కుందవై పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈసినిమా పార్ట్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇటీవల త్రిష రాంగీ సినిమాలో యాక్షన్ హీరోయిన్ అదరగొట్టేసింది. ఈమె నటించిన చతురంగవెట్టై 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం త్రిష రామ్ -1, ది రోడ్డు సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది. అలాగే మరో స్టార్ హీరో అజిత్ 62వ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. అయితే త్రిష ఇంతకుముందు అజిత్ ఇంటికి దగ్గర ఐదు కోట్లతో ఓ ఫ్లాటు కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంట్లో ఉంటున్నారో లేదో తెలియదు కానీ తాజాగా విజయ్ ఇంటి సమీపంలో 35 కోట్లు ఖర్చుపెట్టి ఓ ఇల్లును కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఉంటున్నట్లు టాక్.

Must Read : Mahesh Babu: విదేశాలకు ఒక్కడే వెళ్తున్న గౌతమ్ .. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నమ్రత ..