KTR : సర్జరీ అనంతరం వాకర్ సహాయంతో నడుస్తున్న కేసీఆర్…వైరల్ వీడియో…

KTR  : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు అర్ధరాత్రి ఇంట్లో కాలుజారి పడటంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి కెసిఆర్ గారు కాలు జారి కిందపడడం జరిగింది. దీంతో ఆయన ఎడమ కాళీ తొంటికి గాయం కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షలు నిర్వహించిన యశోద ఆసుపత్రి సిబ్బంది కేసిఆర్ కు హిప్ […]

  • Published On:
KTR : సర్జరీ అనంతరం వాకర్ సహాయంతో నడుస్తున్న కేసీఆర్…వైరల్ వీడియో…

KTR  : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు అర్ధరాత్రి ఇంట్లో కాలుజారి పడటంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి కెసిఆర్ గారు కాలు జారి కిందపడడం జరిగింది. దీంతో ఆయన ఎడమ కాళీ తొంటికి గాయం కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షలు నిర్వహించిన యశోద ఆసుపత్రి సిబ్బంది కేసిఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని నిర్వహించారు. సర్జరీ కూడా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రాణహాని లేదని తొంటి మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లుగా డాక్టర్లు కేసీఆర్ హెల్త్ బులెటీన్ కూడా విడుదల చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు డాక్టర్లు కేసీఆర్ కు ఆపరేషన్ నిర్వహించినట్లుగా సమాచారం.

అయితే కెసిఆర్ ను ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పటినుండి ఆపరేషన్ పూర్తయ్యేంతవరకు కేటీఆర్ అతని కొడుకు ఇమాన్షు , కవిత , హరీష్ రావు సంతోష్ కుమార్ అలాగే పలువురు టిఆర్ఎస్ ముఖ్య నేతలు ఆసుపత్రిలోనే ఉన్నారు. శస్త్ర చికిత్స పూర్తయిన అనంతరం కేసీఆర్ ను వేరే రూమ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు డాక్టర్స్ కేసీఆర్ కు కాస్త నడక నేర్పించారు. వాకర్ సహాయంతో కేసీఆర్ ను నడిపించే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్లు కెసిఆర్ కు ట్రీట్మెంట్ చేయగా ఆయన కోలుకొవడానికి కనీసం 6 నుండి 8 వారాల సమయం పడుతుందని వారు తెలియజేశారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు పూర్తి ఆరోగ్యంతో కెసిఆర్ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.