K. Chandrashekar Rao : కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్…

K. Chandrashekar Rao : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి మెల్లిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కెసిఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మొన్నటి వరకు బెడ్ కే పరిమితమైనైన కేసీఆర్ ఇప్పుడు మెల్లిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య సిబ్బంది సహాయంతో కేసీఆర్ నిదానంగా నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఇంట్లో […]

  • Published On:
K. Chandrashekar Rao : కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్…

K. Chandrashekar Rao : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి మెల్లిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కెసిఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మొన్నటి వరకు బెడ్ కే పరిమితమైనైన కేసీఆర్ ఇప్పుడు మెల్లిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య సిబ్బంది సహాయంతో కేసీఆర్ నిదానంగా నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఇంట్లో ఆయన పక్కన వైద్య సహాయకుడు ఉండగా ఊత కర్ర సహాయంతో కేసిఆర్ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఆ విధంగా తన ఇంట్లోని హాల్ మొత్తం కెసిఆర్ నడిచారు.

అయితే ఊత కర్ర సహాయంతో కెసిఆర్ నడుస్తుండగా తీసిన వీడియోను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు కేసీఆర్ త్వరగా కోలుకుంటారని సంబరపడిపోతున్నారు. కెసిఆర్ త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. అయితే డిసెంబర్ 8న కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ ను యశోద ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 8 వారాలపాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాదులోని నంది నగర్ లో ఉన్న తన ఇంట్లో ఉంటూ కేసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స పొందుతూ వ్యాయామాలు చేస్తూ త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.ఈ క్రమంలోనే తాజాగా ఆయన నడిచేందుకు ప్రయత్నించిన వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.