Ratan Tata : రతన్ టాటా పేరుతో మోసాలు.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా…

Ratan Tata  : రతన్ టాటా… భారత దేశంలో ఈయన పేరు అంటే చాలామందికి ఎంతో గౌరవం.ఆయన అంటే అపారమైన నమ్మకం. ఇక ఆయన చెప్పారంటే చాలామంది ఖచ్చితంగా వింటారు. ఆయనలాగే ఉండాలని చాలామంది అనుకుంటారు. అందుకే సైబర్ నేరగాళ్లు కూడా ఆయన పేరును వాడుకుంటున్నారు. అంతేకాక తాజాగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఆయన ముఖాన్ని కూడా వాడుకుంటున్నారు. ఆయన చెబితే చాలామంది నమ్మేస్తారని, ఆయన మాటల్ని తూచా తప్పక పాటిస్తారనే ఉద్దేశంతో కొందరు ఆన్లైన్ మోసగాళ్లు […]

  • Published On:
Ratan Tata : రతన్ టాటా పేరుతో మోసాలు.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా…

Ratan Tata  : రతన్ టాటా… భారత దేశంలో ఈయన పేరు అంటే చాలామందికి ఎంతో గౌరవం.ఆయన అంటే అపారమైన నమ్మకం. ఇక ఆయన చెప్పారంటే చాలామంది ఖచ్చితంగా వింటారు. ఆయనలాగే ఉండాలని చాలామంది అనుకుంటారు. అందుకే సైబర్ నేరగాళ్లు కూడా ఆయన పేరును వాడుకుంటున్నారు. అంతేకాక తాజాగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఆయన ముఖాన్ని కూడా వాడుకుంటున్నారు. ఆయన చెబితే చాలామంది నమ్మేస్తారని, ఆయన మాటల్ని తూచా తప్పక పాటిస్తారనే ఉద్దేశంతో కొందరు ఆన్లైన్ మోసగాళ్లు ఆయన మొఖాన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మనం చాలానే చూసాం.

ratan-tata-latest-news

ముందుగా ఈ నేరగాల్లు రష్మిక వీడియోను సోషల్ మీడియా షేర్ చేయగా ఆ తర్వాత చాలామంది సినీ సెలబ్రెటీల ఫేస్ మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. ఇక ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు పారిశ్రామికవేత్త రథన్ టాటా గారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఓ సంస్థపై పెట్టుబడి గురించి రతన్ టాటా మాట్లాడినట్టుగా ఒక వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సోనా అగర్వాల్ అనే వ్యక్తి రతన్ టాటా గారిని ఇంటర్వ్యూ చేసినట్లుగా ఫేక్ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో సోనా అగరవాల్ ను తన మేనేజర్ గా రతన్ టాటా పరిచయం చేశారు. భారత ప్రజలకు ఇదేనా సిఫారస్స్ మీరు ఎలాంటి అపోహలు లేకుండా 100% గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం.

ratan-tata-latest-news

దీనికోసం వెంటనే ఈ ఛానల్ కి వెళ్ళండి అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాక దీనిపై కొందరు పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నట్లుగా కూడా వీడియోలను షేర్ చేశారు. ఇక ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో తాజాగా దానిపై రతన్ టాటా గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఫేక్ వీడియో అని దానిని ఎవరు నమ్మవద్దని ఆయన తెలియజేశారు. అది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియో దానిని ఎవరు నమ్మవద్దు అంటూూ తన సోషల్ మీడియాలో రతన్ టాటా గారు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఏఇ టెక్నాలజీ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది. దీని కారణంగా ఇంకా ఎంతమంది ఎలాంటి మోసాలకు పాల్పడతారు అంటూ చాలామంది భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి పెట్టుబడులకు సంబంధించి ,డబ్బులకు సంబంధించి , ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.