Bluetooth : మీ ఫోన్ బ్లూటూత్ ఎప్పుడు ఆన్ లోనే ఉంచుతున్నారా… తస్మాత్ జాగ్రత్త…

Bluetooth : ప్రస్తుత కాలంలో చాలామంది బైక్ పై డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడాలన్నా, పనులు చేస్తూ సాంగ్స్ వినాలి అన్న , తదితర పనులకు బ్లూటూత్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ యుగంలో బ్లూటూత్ పెద్ద సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా బ్లూటూత్ ద్వారా వినియోగించే ఇయర్ ఫోన్స్ అన్ని పనులను చక్కబట్టేస్తుంటాయి. దీనివలన ప్రతి ఒక్కరుూ బ్లూటూత్ ను ఎక్కువగా ఆన్ లో ఉంచుతున్నారు. అయితే బ్లూటూత్ ను ఎక్కువగా ఆన్ లో ఉంచితే […]

  • Published On:
Bluetooth : మీ ఫోన్ బ్లూటూత్ ఎప్పుడు ఆన్ లోనే ఉంచుతున్నారా… తస్మాత్ జాగ్రత్త…

Bluetooth : ప్రస్తుత కాలంలో చాలామంది బైక్ పై డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడాలన్నా, పనులు చేస్తూ సాంగ్స్ వినాలి అన్న , తదితర పనులకు బ్లూటూత్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ యుగంలో బ్లూటూత్ పెద్ద సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా బ్లూటూత్ ద్వారా వినియోగించే ఇయర్ ఫోన్స్ అన్ని పనులను చక్కబట్టేస్తుంటాయి. దీనివలన ప్రతి ఒక్కరుూ బ్లూటూత్ ను ఎక్కువగా ఆన్ లో ఉంచుతున్నారు. అయితే బ్లూటూత్ ను ఎక్కువగా ఆన్ లో ఉంచితే చాలా ప్రమాదం అని మీలో ఎంతమందికి తెలుసు…?

do-you-always-keep-your-phones-bluetooth-on-be-careful

ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ,విండోస్ ,లినక్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలో బ్లూటూత్ ను నిరంతరం ఆన్ లో ఉంచితే ఆ డివైస్ లను బ్లూ బోర్న్ అనే మార్గం ద్వారా హ్యాకర్స్ ఎటాక్ చేసే ప్రమాదం ఉంది. బ్లూ బోర్న్ అనేది ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడానికి మరియు కార్పొరేట్ డేటాను దొంగలించడానికి, నెట్వర్క్ యాక్సిస్ ని పొందడానికి మరియు మాల్వేర్ వైరస్ వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఈ బ్లూ బోర్న్ ఎటాక్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ నెట్ వర్క్ లో బలహీనమైన ప్రదేశాన్ని టార్గెట్ చేస్తుంటాయి. దీంతో ఎలాంటి సెక్యూరిటీ వ్యవస్థ డివైస్ ను రక్షించలేదు.

do-you-always-keep-your-phones-bluetooth-on-be-careful

ఇది గాలి ద్వారా చాలా సులువుగా వ్యాప్తి చెందుతుంది. దీనివలన హెకర్లు అన్నింటిపై నియంత్రణ సాధించగలుగుతున్నారు. కాబట్టి బ్లూటూత్ ను నిరంతరం ఆన్ లో ఉంచేవారు వారి పర్సనల్ డేటాను చేతులారా హ్యాకర్ల చేతిలో పెట్టినట్లే. అయితే ఈ బ్లూ బోర్న్ ఎటాక్ నుండి తప్పించుకోవాలంటే అవసరమైనప్పుడు మాత్రమే బ్లూటూత్ ను ఆన్ లో ఉంచుకోవాలి. ఇక తప్పని పరిస్థితుల్లో బ్లూటూత్ ను ఎక్కువసేపు ఆన్ లో ఉంచాలనుకుంటే , ఆండ్రాయిడ్ సిస్టమ్ ను అప్డేట్ చేసుకోవడం మంచిది. ఆండ్రాయిడ్ వర్షన్ ను తాజాగా ఉంచుకోవడం లేదా బ్లూటూత్ వినియోగం తగ్గించడం ద్వారా బ్లూ బోర్న్ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.