Naga Chaithanya-Shobitha : నాగచైతన్యతో పెళ్లి నిజమే అనిపించేలా శోభిత పోస్ట్.. కొన్ని రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి కానుందా..

Naga Chaithanya-Shobitha : గత కొద్దిరోజుల నుండి సిని ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు నటి శోభిత ధూళిపాల పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరు ఏ విధంగాను స్పందించలేదు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ మరల ఈ మధ్యకాలంలో చెఫ్ సురేంద్రమోహన్ నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో […]

  • Published On:
Naga Chaithanya-Shobitha : నాగచైతన్యతో పెళ్లి నిజమే అనిపించేలా శోభిత పోస్ట్.. కొన్ని రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి కానుందా..

Naga Chaithanya-Shobitha : గత కొద్దిరోజుల నుండి సిని ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు నటి శోభిత ధూళిపాల పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరు ఏ విధంగాను స్పందించలేదు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ మరల ఈ మధ్యకాలంలో చెఫ్ సురేంద్రమోహన్ నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఆ ఫోటోలలో వెనుక టేబుల్ దగ్గర శోభిత ధూళిపాల కూర్చుని కనిపించింది. దీంతో నేటిజనులు ఆమెను గుర్తుపట్టి వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అంటూ వీరి గురించి మరోసారి వార్తలను ప్రచారం చేశారు.

Shobhita's post makes marriage with Naga Chaitanya seem real.. Will they get married in a few days..

Shobhita’s post makes marriage with Naga Chaitanya seem real.. Will they get married in a few days..

అయితే తాజాగా శోభిత తన సోదరి పెళ్లిలో జరిగిన కొన్ని విషయాలను మరియు ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే శోభిత తన సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేస్తూ నార్త్ మరియు సౌత్ కలిసినప్పుడు అంటూ క్యాప్షన్ పెట్టింది . ఇలా శోభిత పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే శోభిత సౌత్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఇక సౌత్ హీరో అయిన నాగచైతన్య తో పెళ్లి చేసుకోవడానికి రెడీ అనే విషయాన్ని పరోక్షంగా తెలియచేసిందా ఏంటి అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Shobhita's post makes marriage with Naga Chaitanya seem real.. Will they get married in a few days..

అయితే శోభిత ధూళిపాల తన సోదరి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ నా సోదరి ఆంధ్రప్రదేశ్ అయితే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఢిల్లీ కి చెందినవాడు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లిపై తనకు చాలా నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో శోభిత తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని శోభిత బయటపెట్టి నాగచైతన్యతో పెళ్లికి ఓకే అంటూ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చిందా అని పలువురు అంటున్నారు. అయితే గతంలో నాగచైతన్య మరియు శోభితల మధ్య ఏదో జరుగుతున్నట్లు వార్తలు వచ్చినప్పుడు స్పందించిన శోభిత , ఇప్పుడు వస్తున్న వార్తలకు ఎందుకు స్పందించడం లేదని నేటిజనులు కామెంట్స్ పెడుతున్నారు.