Project K : హాలీవుడ్ తరహాలో ప్రాజెక్ – K ఫస్ట్ లుక్ పోస్టర్….అభిమానుల రియాక్షన్ ఏంటంటే….

Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు రాబోతున్న సలార్ సినిమాపై ఉన్నాయి. సాలార్ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో నమ్ముతున్నారు. ఇక ఆ సినిమా తర్వాత రాబోతున్న ప్రాజెక్టు k కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది అని ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అంతేకాక ఈ సినిమాకు  నాగ్ అశ్విన్  దర్శకత్వం వహించడం మరియు 50 సినిమాలు అనుభవం […]

  • Published On:
Project K : హాలీవుడ్ తరహాలో ప్రాజెక్ – K ఫస్ట్ లుక్ పోస్టర్….అభిమానుల రియాక్షన్ ఏంటంటే….

Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు రాబోతున్న సలార్ సినిమాపై ఉన్నాయి. సాలార్ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో నమ్ముతున్నారు. ఇక ఆ సినిమా తర్వాత రాబోతున్న ప్రాజెక్టు k కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది అని ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అంతేకాక ఈ సినిమాకు  నాగ్ అశ్విన్  దర్శకత్వం వహించడం మరియు 50 సినిమాలు అనుభవం ఉన్న వైజయంతి మూవీస్ 550 కోట్లు బడ్జెట్ కేటాయించడంతో ఈ సినిమా వెరె లెవెల్ లో ఉండబోతుందని, ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూశాక ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు కాస్త తగ్గాయని చెప్పాలి.

projek-k-first-look-poster-in-hollywood-style-fans-reaction-is

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ హాలీవుడ్ హీరో తరహాలో పవర్ ఫుల్ గా కనిపించాడు. సరికొత్త కాస్ట్యూమ్స్ ధరించి సరికొత్త గడ్డం డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించాడు. అయితే సినిమాలో కుడా ఇలానే ఉంటుందో తెలియదు కానీ ఈ పోస్టర్ ను చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పాలి. ఈ పోస్టర్ ను చూసి పొరపాటున ప్యాన్ మేడ్ పిక్స్ ను పోస్ట్ చేశారా అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాక కాస్ట్యూమ్ లో ప్రభాస్ తలకాయను అతికించినట్లుగా కనిపిస్తుందంటూ మరి కొందరు కౌంటర్స్ వేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ప్రాజెక్టుకే ఫస్ట్ లుక్ కోసం ఇన్నాళ్లు ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులకు వైజయంతి మూవీస్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు.

projek-k-first-look-poster-in-hollywood-style-fans-reaction-is

అంతేకాక ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ ఫోటోలను దీంతో కంపేర్ చేసి చూస్తే అవే చాలా బాగున్నాయి అనిపిస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ కే పై పెట్టుకున్న నమ్మకాలు,చాలామందిలో ఆవిరిపోయాయి. బాహుబలి వంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా కూడా అభిమానులను నిరుత్సాహపరుస్తూనే వస్తుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆది పురుషు కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కే పోస్టర్ తో మరోసారి అభిమానులను నిరుత్సాహపరిచారు. మరి ఫస్ట్ గ్లింప్సీ లో అయిన ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా వైజయంతి మూవీస్ తప్పులను సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.