Nayanatara : సచ్చినా .. ఆ స్టార్ హీరో తో సినిమా చేయను : నయనతార

Nayanatara : ప్రస్తుతం నయనతార రేంజ్ మామూలుగా లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయన్ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక ఈ బ్యూటీ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు పెళ్లి తర్వాత కూడా వరుస సిని ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇటీవల స్టార్ హీరో అజిత్, డైరెక్టర్ […]

  • Published On:
Nayanatara : సచ్చినా ..  ఆ స్టార్ హీరో తో సినిమా చేయను : నయనతార

Nayanatara : ప్రస్తుతం నయనతార రేంజ్ మామూలుగా లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయన్ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక ఈ బ్యూటీ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు పెళ్లి తర్వాత కూడా వరుస సిని ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇటీవల స్టార్ హీరో అజిత్, డైరెక్టర్ విగ్నేష్ శివన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా అనుకోని కారణాల వలన ఆగిపోయింది.

అంతేకాదు ఆ సినిమా ఆగిపోవడంతో డైరెక్టర్ విగ్నేష్ శివనత డిప్రెషన్ కు లోనయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో నయనతార తన భర్తకు భారీగా అవమానం జరగటంతో ఇకనుంచి తాను అజిత్ కు జోడిగా నటించకూడదని డిసైడ్ అయ్యిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా అజిత్ సినిమాలో అస్సలు నటించనని నయనతార ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్లో అజిత్ నయనతార కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం నయనతార అజిత్ తో నటించకూడదని ఫిక్స్ అయిందట.

ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే దీనిపై నయనతార క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు పది కోట్ల పారితోషకం తీసుకుంటుంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది నయన్. అయితే ఈమెకు టాలీవుడ్లో అంతగా అవకాశాలు రావడం లేదు కానీ కోలీవుడ్ బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినీమాలు చేస్తుంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతుంది. ఇక కోలీవుడ్లో డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ సినిమాలో నటిస్తుంది.

Must Read : Anand Mahindra : రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు డాన్స్ వేసిన ఆనంద్ మహీంద్రా .. వీడియో వైరల్ ..