Thirupati : తిరుపతిలో వరుస అక్రమాలు.. బెంబేలెత్తిపోతున్న తిరుపతి వాసులు..

Thirupati  : ఇటీవల తిరుపతిలో బైక్ ను కాల్చిన ఘటన కలకలాన్ని రేపుతుంది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ సంఘటన తిరుపతిలోని లీలామహల్ సంజయ్ గాంధీ కాలనీలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో 5 బైకులు ఒక ఒక సైకిల్ అగ్నికి అహుతి అయినాయి. […]

  • Published On:
Thirupati : తిరుపతిలో వరుస అక్రమాలు.. బెంబేలెత్తిపోతున్న తిరుపతి వాసులు..

Thirupati  : ఇటీవల తిరుపతిలో బైక్ ను కాల్చిన ఘటన కలకలాన్ని రేపుతుంది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ సంఘటన తిరుపతిలోని లీలామహల్ సంజయ్ గాంధీ కాలనీలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో 5 బైకులు ఒక ఒక సైకిల్ అగ్నికి అహుతి అయినాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అయితే ఈ ఘటన జరిగిన సమీపంలో బార్ షాప్ ఉందని అక్కడ మద్యం తాగిన వాళ్లు, మధ్యం మత్తులో ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారని ఇంటి యజమాని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా తిరుపతి సమీపంలో మరో చోరీ జరిగింది. పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారు. ఈ ఘటన తిరుపతి సమీపంలోని ఆరేపల్లి రంగపేటలో చోటు చేసుకుంది . రాఘవయ్య , నీలిమ అనే దంపతులు ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు. రాఘవయ్య రంగా పేట లోని ఒక విద్యాసంస్థలో కూలి పనులు చేస్తుంటాడు. అయితే పాఠశాలకు రెండు రోజులు సెలవులు రావడంతో తన భార్య పుట్టింటికి వెళ్ళగా రాఘవయ్య పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి తాళాలను పగలగొట్టి లోపల చొరబడ్డారు. వారు బీరువాలో దాచుకున్న 13 సవర్ల బంగారం అభరణాలతో పాటు, లక్ష రూపాయల నగదును దోచుకెళ్లిపోయారు . అయితే ఊరు వెళ్ళిన నీలిమా ఇంటికి తిరిగి రాగానే తలుపులు బీరువా తెరిచి ఉండడం చూసి, రాఘవయ్యకు చెప్పింది.

వెంటనే రాఘవయ్య సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వేలిముద్ర నిపుణులతో తనిఖీలు చేయించి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు వరదయ్యపాలెం మండలంలోని చిన్న పాండూరులో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడ కూడా గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేశారు. ఆ ఇంటి యజమాని ఏకాంబరం ఆదివారం ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో చెన్నైలోనే బంధువుల దగ్గరకు వెళ్లారట. మరల సోమవారం రోజు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరచి ఉండడంతో ,ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా తలుపులు తెరిచి ఉండటం చూసి దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వరుసగా జరుగుతున్న అక్రమాలతో తిరుపతి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.