RGV : నాగార్జున యూనివర్సిటీలో రాంగోపాల్ వర్మ బూతు పురాణం..వీడియో వైరల్..

RGV : సంచలన వ్యాఖ్యలకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు ప్రొఫెసర్ల ముందు తాగండి , తినండి , శృంగారం చేయండి అంటూ అసభ్యకరంగా మాట్లాడటమే కాక, ఆయన మాటలకు యూనివర్సిటీ వీసి వత్తాసు పలకడం వివాదాస్పదంగా మారింది. అయితే రాంగోపాల్ వర్మ వీధి కుక్కలను ఉద్దేశించి ఈ మధ్య సోషల్ మీడియాలో చేసిన […]

  • Published On:
RGV : నాగార్జున యూనివర్సిటీలో రాంగోపాల్ వర్మ బూతు పురాణం..వీడియో వైరల్..

RGV : సంచలన వ్యాఖ్యలకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు ప్రొఫెసర్ల ముందు తాగండి , తినండి , శృంగారం చేయండి అంటూ అసభ్యకరంగా మాట్లాడటమే కాక, ఆయన మాటలకు యూనివర్సిటీ వీసి వత్తాసు పలకడం వివాదాస్పదంగా మారింది. అయితే రాంగోపాల్ వర్మ వీధి కుక్కలను ఉద్దేశించి ఈ మధ్య సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు హంగామా అంత ఇంత కాదని చెప్పాలి. జిహెచ్ఎంసి మేయర్ పై పలు రకాల వీడియోలతో సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వర్మ ఆమెపై ఒక సాంగ్ ను కూడా విడుదల చేయడం గమనార్హం. మరలా ఇప్పుడు యూనివర్సిటీ లో స్టూడెంట్స్ ని తప్పుదారి పట్టించేలా మాట్లాడి వార్తలు లోకి వచ్చారు.

ramgopal-varma-sexuial-comments-in-nagarjuna-university-video-viral

ramgopal-varma-sexuial-comments-in-nagarjuna-university-video-viral

అయితే నాగార్జున యూనివర్సిటీలో వర్మ మాట్లాడుతూ విద్యార్థులు మీరంతా మీకు ఇష్టమైన పనులు మాత్రమే చేయండి, ఎవరి మాట వినకండి, అప్పుడే మీరు పైకి వస్తారంటూ చెప్పుకొచ్చారు. టీచర్లు , తల్లిదండ్రులు పిల్లలకు హద్దులు పెట్టి వారిని వేధించవద్దని విద్యార్థులంతా మీకు నచ్చింది తినండి, నచ్చింది త్రాగండి శృంగారంలో పాల్గొనండి అంటూ ఆయన మాట్లాడారు. రేపు చచ్చాక పైన స్వర్గం ఉంటుందని అక్కడ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వంటి అందగత్తెలు ఉంటారని అపోహ లో లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఉండకండి. ఒకవేళ చచ్చినాక స్వర్గం అనేది లేకపోతే ఏం చేస్తారు..? అందుకే ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి.. నా వరకు నేను ఏమనుకుంటానంటే ఏదైనా వైరస్ వచ్చి మగజాతి మొత్తం అంతమైపోవాలని, నేనొక్కన్నే బ్రతికి ఉండాలని , ఈ భూమి మీద ఉన్న మహిళలందరికీ నేను ఆప్షన్ కావాలనేది నా డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చారు.

ramgopal-varma-sexuial-comments-in-nagarjuna-university-video-viral

ramgopal-varma-sexuial-comments-in-nagarjuna-university-video-viral

జీఎస్టీ 2 ఎప్పుడని అడుగుతున్న వారందరికీ సమాధానం ఒకటే మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయిగా, అయితే జీఎస్టీ 2 సినిమాను మీరే తీసుకోవచ్చు అంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆర్జీవి మాటలు విన్న మహిళా లెక్చరర్స్ విద్యార్థులు ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. అంతేకాక యూనివర్సిటీ అధికారులు తీరుపై తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వర్మ గారు ఒక ప్రొఫెసర్ కంటే ఎక్కువ అని, వర్మ గారికి పీహెచ్డీ ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయంటూ, యూనివర్సిటీ విసి చెప్పడం గమనార్హం.