Lovers : హైవేపై ప్రేమ జంట వికృత చేష్టలు… భారీ జరిమానా విధించిన అధికారులు….వీడియో వైరల్

Lovers  : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఉద్దేశంతో చాలామంది వికృతి చేష్టలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను మనం రోజు చాలానే చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఓ ప్రేమ జంట హైవేపై బైక్ మీద వెళ్తూ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే రహదారిపై వెళ్తున్న ఒక కార్ లోని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అధికారులు గమనించి వారికి భారీ జరిమానా విధించారు. దీంతో ప్రస్తుతం […]

  • Published On:
Lovers : హైవేపై ప్రేమ జంట వికృత చేష్టలు… భారీ జరిమానా విధించిన అధికారులు….వీడియో వైరల్

Lovers  : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఉద్దేశంతో చాలామంది వికృతి చేష్టలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను మనం రోజు చాలానే చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఓ ప్రేమ జంట హైవేపై బైక్ మీద వెళ్తూ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే రహదారిపై వెళ్తున్న ఒక కార్ లోని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అధికారులు గమనించి వారికి భారీ జరిమానా విధించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ సమీపంలో గల ఇందిరాపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ ,బండికి ముందు ఉండే పెట్రోల్ ట్యాంక్ పై యువతిని కూర్చోబెట్టుకున్నాడు.

యువకుడు బైక్ ను డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే , యువతి ప్రియుడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దులతో రెచ్చిపోతుంది. ఈ విధంగా చేస్తూ కూడా వారు బైకు ను చాలా వేగంగా నడుపుతూూ వెళ్తున్నారు. అదే సమయానికి జాతీయ రహదారిపై కారు లో వస్తున్న ఓ వ్యక్తి ఈ జంట చేస్తున్న వికృత చేష్టలను గమనించి వీడియో తీసి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఈ వీడియో చూసిన నీటిజనులు ప్రేమికుల ప్రవర్తన పై మండిపడ్డారు. ఇలా బహిరంగంగా వికృతి చేష్టలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ కు విజ్ఞప్తి చేశారు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో కాస్త ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది.

అయితే పలువురు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేయడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న బైక్ నెంబర్ ఆధారంగా…వారికి భారీగా చలానా విధించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడమే కాకుండా బైక్ పై వికృతి చేష్టలు చేయడం మరియు కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు వారికి ఏకంగా రూ.21వెల జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకుగాను వెయ్యి రూపాయలు, నెంబర్ ప్లేట్ సరిగా లేనందున 5 వేలు , సరైన నియమాలు పాటించనందుకు 10 వేలు , బైక్ ను చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసినందుకు 5 వేలు విధించారు. విధించిన చలానాను ట్రాఫిక్ పోలీస్ శాఖ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది. వారికి తగిన శాస్తి జరిగిందని పలువురు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.