Banana : అరటి పండ్లను ఈ నిర్దిష్ట సమయంలోనే తీసుకోవాలి…..ఎందుకో తెలుసా…

Banana  : మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువగా ఆరోగ్యం కోసమే తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం పండ్లను ఎక్కువగా తింటాం. అందులోనూ సంవత్సరం పొడవునా పండే అరటి పండ్లను ఇంకా ఎక్కువగా తీసుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని ఇష్టంగా తింటారు . అరటి పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. అంతేకాక అరటి పండ్లు చాలా ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్నాయి. తద్వారా బరువు తగ్గడం, జీర్ణక్రియ ,గుండె […]

  • Published On:
Banana : అరటి పండ్లను ఈ నిర్దిష్ట సమయంలోనే తీసుకోవాలి…..ఎందుకో తెలుసా…

Banana  : మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువగా ఆరోగ్యం కోసమే తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం పండ్లను ఎక్కువగా తింటాం. అందులోనూ సంవత్సరం పొడవునా పండే అరటి పండ్లను ఇంకా ఎక్కువగా తీసుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని ఇష్టంగా తింటారు . అరటి పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. అంతేకాక అరటి పండ్లు చాలా ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్నాయి. తద్వారా బరువు తగ్గడం, జీర్ణక్రియ ,గుండె ఆరోగ్యానికి ప్రయోజనం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

bananas-should-be-taken-at-this-particular-time-do-you-know-why

నిపుణుల సమాచారం ప్రకారం అరటి పండ్లు ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.  అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం అరటి పండ్లు తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలి. అంతేకాక అరటి పండ్లు జీర్ణక్రియకు సహాయపడే పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. అయితే ఇన్ని ఆరోగ్యకరమైన లక్షణాలు కలిగి ఉన్న అరటి పండ్లను ఓ నిర్దిష్ట సమయంలో తీసుకోవడం వలన మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మరి అరటి పండ్లు తినడానికి ఏది సరైన సమయమో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లను రోజు లో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.

కానీ ఎక్కువగా ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం చాలా మంచిది. అయితే మానవ శరీరం జీవక్రియ ప్రక్రియ అనేది రాత్రివేళ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం అరటి పండ్లు తీసుకోవడం చాలా మంచిది . అరటి పండ్లను రాత్రిపూట తినడం వలన చక్కని నిద్ర పడుతుంది. అయితే అరటి పండ్లను ఖాళీ కడుపుతో అసలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వలన అరటిపండులో ఉండే ఆమ్లా స్వభావం జీర్ణక్రియ ఒత్తిడిని పెంచుతుంది. కావున అల్పాహారంలో అరటిపండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడండం చాలా మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.