Eye Protection : కంప్యూటర్ల ముందు ఎక్కువసేపుు పని చేస్తున్నారా… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Eye Protection : కంటి చూపు అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. దాని విలువ చూపు లేని వారికి బాగా అర్థమవుతుంది. కానీ కంటిచూపు మంచిగా ఉన్నప్పుడు దానిని కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. కళ్ళు అనవసరమైన ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫోన్లు, లాప్టాప్ ల ముందు కూర్చుని గంటలు తరబడి గేమ్స్ ఆడుకోవడం సోషల్ మీడియాలో టైం పాస్ చేయడం వంటివి చేస్తున్నారు. దీని కారణంగా […]

  • Published On:
Eye Protection : కంప్యూటర్ల ముందు ఎక్కువసేపుు పని చేస్తున్నారా… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Eye Protection : కంటి చూపు అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. దాని విలువ చూపు లేని వారికి బాగా అర్థమవుతుంది. కానీ కంటిచూపు మంచిగా ఉన్నప్పుడు దానిని కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. కళ్ళు అనవసరమైన ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫోన్లు, లాప్టాప్ ల ముందు కూర్చుని గంటలు తరబడి గేమ్స్ ఆడుకోవడం సోషల్ మీడియాలో టైం పాస్ చేయడం వంటివి చేస్తున్నారు. దీని కారణంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే నెటి తరం యువత రోజులో ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే జీవించేస్తున్నారు. ఇక కంప్యూటర్ల ముందు పని చేసే వారు కనీసం 50 నుండి 90 శాతం మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.అయితే కంప్యూటర్ వాడకం వలన వచ్చే ఈ సమస్యలు ఎలా వస్తాయి? వీటిని ఎలా నివారించుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏంటి..?

డిజిటల్ పరికరాలను ఎక్కువగా వినియోగించడం ,డిజిటల్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ కళ్ళ మీద పడినప్పుడు కళ్ళు వాటికి తగినట్లుగా కంటి చూపును అడ్జస్ట్ చేసుకుంటాయి. అప్పుడే లైట్ అనేది కంటి రెటీనా పై సరిగ్గా పడుతుంది. దీనివలన మనం వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నాం. అయితే మనం డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడుపుతున్నట్లయితే కళ్ళ కండరాలపై ఒత్తిడి పెగుతుంది. ఇది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కు దారితీస్తుంది.

ఎలాంటి సమస్యలు వస్తాయి…

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కారణం గా తలనొప్పి రావడం, కళ్ళు పొడిబారడం, చూపు మసకగా మారడం, చదివేటప్పుడు ఇబ్బంది కలగడం, ఏకాగ్రత కోల్పోవడం, ఏదైనా చిన్నపాటి కాంతిని కూడా కళ్ళు ఎదురుకోలేక పోతాయి.

ఎలా నివారించుకోవాలి …

20-20-20రూల్ పాటించి కళ్ళపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి బ్రేక్ తీసుకోవడం, బ్రేక్ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు చూడడం. రోజు ఇలా చేయడం వలన కళ్ళకు ఉపశమనం లభిస్తుంది. దీనివలన విజన్ సిండ్రోమ్ సమస్య భారిన పడకుండా ఉంటారు. అలాగే కళ్ళపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు డిజిటల్ స్క్రీన్ లకు దూరంగా ఉండాలి. స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ తగ్గించుకుని వాడాలి. దీనివలన బ్లూ లైట్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. అలాగే ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీని వలన కంటి చూపులో ఏమైనా లోపాలు వస్తే వెంటనే సరి చేసుకోవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు