Tirumala Tirupati : తిరుమలలో మహాద్భుతం… సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షమేనా…

Tirumala Tirupati : తిరుమలలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరపు లేకుండా వర్షాలు పడడం వలన వీధులన్నీ జలమయమయ్యాయి.భారీ వర్షాలతో తిరుమల లోని జలాశయాలన్నీ నీటితో నిండిపోయాయి.పాప వినాశని ఆకాశగంగ ,గోదావరి, కేపీ డ్యాములు నిండిపోయాయి. జలపాతాలు నీటితో కలకలాడుతున్నాయి. అలాగే తిరుమల కొండపై నుండి నీరు కిందకు పడుతుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే శేషాచలం అడవి ఏడుకొండలపై ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి […]

  • Published On:
Tirumala Tirupati : తిరుమలలో మహాద్భుతం… సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షమేనా…

Tirumala Tirupati : తిరుమలలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరపు లేకుండా వర్షాలు పడడం వలన వీధులన్నీ జలమయమయ్యాయి.భారీ వర్షాలతో తిరుమల లోని జలాశయాలన్నీ నీటితో నిండిపోయాయి.పాప వినాశని ఆకాశగంగ ,గోదావరి, కేపీ డ్యాములు నిండిపోయాయి. జలపాతాలు నీటితో కలకలాడుతున్నాయి. అలాగే తిరుమల కొండపై నుండి నీరు కిందకు పడుతుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే శేషాచలం అడవి ఏడుకొండలపై ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై అద్భుతం ఆవిష్కరణమైంది. కలియుగ వైకుంఠమైన ఏడుకొండలల నుండి జాలువారుతున్న ఓ జలతార అచ్చం స్వామివారి మూడు నామాలుగా ప్రతిబింబిస్తూ భక్తులను ప్రత్యక్షంగా కనువిందు చేస్తుంది.

సప్తగిరులలో ఈ అద్భుతాన్ని చూసి భక్తులు చాలా మైమరిచిపోతున్నారు.అలాగే ఇదంతా కచ్చితంగా స్వామివారి మహిమ అని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలా కొండపై నుండి పరవళ్ళు తొక్కుతున్న నీటిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు ఈ జలపాతాలను కూడా చూస్తూ పులకరించి పోతున్నారు. ఇక కొండపై నుండి జాలు వారుతున్న ఆ మూడు జలపాతాలను చూస్తుంటే సాక్షాత్తు వెంకటేశ్వరుని తిరునామంల ఉందని అంటున్నారు.

అయితే దీనికి సంబంధించిన వీడియోను భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా గత మూడు రోజులుగా తిరుమల క్షేత్రమంతా నీటితో నిండిపోయింది. ఈ క్రమంలోనే భక్తులు వర్షంలో తడుస్తూనే దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలలో టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్లలో భక్తులను కేవలం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పంపిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆంక్షలు సడలిస్తామని
టీటీడి అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు తిరుమల కొండల్లో ఉన్న డ్యామ్ లలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది.