Kidney care : కిడ్నీల పై ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Kidney care : మానవ శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఒకప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ మార్పిడి సాధ్యపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కిడ్నీ మార్పిడి అనేది సాధ్యపడుతుంది. దీనికోసం శరీరంలోని యాంటీ బాడీస్ ని లెక్కించి, ప్లాస్మా ప్రొసీజర్ ను ఉపయోగించి యాంటీ బాడీలో పరిమాణాన్ని క్రమేపి తగ్గిస్తారు. మరల కొత్తవి ఉత్పత్తి కాకుండా సర్జరీకి ముందే ఇంజక్షన్ ఇచ్చి […]

  • Published On:
Kidney care : కిడ్నీల పై ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Kidney care : మానవ శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఒకప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ మార్పిడి సాధ్యపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కిడ్నీ మార్పిడి అనేది సాధ్యపడుతుంది. దీనికోసం శరీరంలోని యాంటీ బాడీస్ ని లెక్కించి, ప్లాస్మా ప్రొసీజర్ ను ఉపయోగించి యాంటీ బాడీలో పరిమాణాన్ని క్రమేపి తగ్గిస్తారు. మరల కొత్తవి ఉత్పత్తి కాకుండా సర్జరీకి ముందే ఇంజక్షన్ ఇచ్చి కిడ్నీ మార్పిడిని చేస్తారు. అవసరమైతే సర్జరీ అయిన తర్వాత కూడా ప్లాస్మా ప్రొసీజర్ ను చేయాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడి జరిగిన నెల రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు పెరిగినప్పటికీ, కిడ్నీకి మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. అయితే అసలు కిడ్నీ సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడితే ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

* నికోటిన్ పదార్థం కలిగి ఉన్న ధూమపానం , గుట్కా, పాన్ మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

*కిడ్నీ సమస్య ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకోకూడదు.

* 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఏడాదికోసారి మూత్రపిండాలను పరీక్షించుకోవడం మంచిది.

*ఉప్పు వాడకం తగ్గించాలి.

* రోజులో కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా మంచిది.

*రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.

*బరువును అదుపులో ఉంచుకునేందుకు కసరత్తులు చేయాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్నీ ఇంటర్నెట్లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.