Wheat Flour – Maida : ఈ రెండు తయారయ్యేది గోధుమలతోనే …కానీ వేరువేరు లక్షణాలు ఎందుకో తెలుసా…

Wheat Flour – Maida : మనం ఆరోగ్యం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ముందుగా మనకు గుర్తొచ్చే పేరు గోధుమలు.. అయితే గోధుమలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కానీ గోధుమల నుండే తయారయ్యే మైదా ను తినడం మాత్రం మంచిది కాదు. అయితే మనం ఎక్కువగా ఉపయోగించే గోధుమపిండి మరియు మైదా రెండింటిని గోధుమల నుండి తయారు చేస్తారు. కానీ రెండింటికి ఇంత తేడా ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా…? ఒకటి ప్రయోజనకరంగా […]

  • Published On:
Wheat Flour – Maida : ఈ రెండు తయారయ్యేది గోధుమలతోనే …కానీ వేరువేరు లక్షణాలు ఎందుకో తెలుసా…

Wheat Flour – Maida : మనం ఆరోగ్యం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ముందుగా మనకు గుర్తొచ్చే పేరు గోధుమలు.. అయితే గోధుమలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కానీ గోధుమల నుండే తయారయ్యే మైదా ను తినడం మాత్రం మంచిది కాదు. అయితే మనం ఎక్కువగా ఉపయోగించే గోధుమపిండి మరియు మైదా రెండింటిని గోధుమల నుండి తయారు చేస్తారు. కానీ రెండింటికి ఇంత తేడా ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా…? ఒకటి ప్రయోజనకరంగా ఉంటే మరొకటి మాత్రం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఈ రెండింటికి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

both-of-these-are-made-from-wheat-but-do-you-know-why-they-have-different-properties

అయితే గోధుమల నుండి గోధుమపిండి తయారు చేస్తారు. దాని తర్వాత మైదా ను తయారు చేస్తారు. దీనికోసం ముందుగా గోధుమలను గ్రైండ్ చేస్తారు. గోధుమ రవ్వగా లేదా పిండిగా తయారు చేసి పెట్టుకుంటారు. అయితే మైదా తయారు చేసేటప్పుడు అది పూర్తిగా మెత్తబడదు. చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే వస్తుంది. దానిని ఇంకా మెత్తగా గ్రైండ్ చేస్తే పిండిలా మారుతుంది. తర్వాత దానిని ఫైన్ చేసేలా ఒక రకమైన గ్యాస్ ను పంపిస్తారు. ఇలా గోధుమ పిండిని తయారు చేస్తారు. మైదాను కూడా గోధుమ నుంచే తయారు చేస్తారు. కానీ దీని ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. మైదా తయారు చేయడానికి ముందుగా అన్ని గోధుమ గింజల పై పోర ను తీసేస్తారు.

both-of-these-are-made-from-wheat-but-do-you-know-why-they-have-different-properties

గింజల పై భాగం తొలగించడం ద్వారా తెల్లటి భాగం చాలా మెత్తగా తయారవుతుంది. ఇక దీనిని గ్రైండ్ చేసి 80 మేష్ జల్లెడ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత కూడా అది లేత పసుపు రంగులోకి మారదు తెల్లగానే ఉంటుంది. అయితే గోధుమపిండి మరియు మైదా వేరువేరు లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే గోధుమ పిండిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మైదాలో ఉండే పోషకాలు అంత మంచివి కావు. అందుకే మైదా ఎక్కువగా తినకూడదని డాక్టర్లు సలహా ఇస్తారు. దీనిని ఎక్కువగా తినడం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు ఊపకాయం వంటివి వస్తాయి. అందుకే మైదా ఎక్కువగా తినకూడదని సలహా ఇస్తారు.