Sudeepa Pinky : “నువ్వు నాకు నచ్చావ్” పేం పింకీ గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో చూస్తే దిమ్మతిరగాల్సిందే..

Sudeepa Pinky : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ఆ సినిమాలో వెంకీ తో అల్లరి చేసి నవ్వించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో సుదీప ఫుల్ క్రేజ్ ను తెచ్చుకుంది అని చెప్పాలి. ఎంతలా అంటే ఆమె పేరు సుదీప అయినప్పటికీ ఈ సినిమా తర్వాత ఆ పేరు కాస్త పింకీగా మారిపోయింది. అంతటి స్టార్ డమ్ ను […]

  • Published On:
Sudeepa Pinky : “నువ్వు నాకు నచ్చావ్” పేం పింకీ గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో చూస్తే దిమ్మతిరగాల్సిందే..

Sudeepa Pinky : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ఆ సినిమాలో వెంకీ తో అల్లరి చేసి నవ్వించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో సుదీప ఫుల్ క్రేజ్ ను తెచ్చుకుంది అని చెప్పాలి. ఎంతలా అంటే ఆమె పేరు సుదీప అయినప్పటికీ ఈ సినిమా తర్వాత ఆ పేరు కాస్త పింకీగా మారిపోయింది. అంతటి స్టార్ డమ్ ను ఆ క్యారెక్టర్ సుదీపకు తెచ్చిపెట్టింది. అయితే సుదీప 28 ఫిబ్రవరి 1987లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సూర్యనారాయణ సత్యవతి.ఈమె తల్లిదండ్రులు ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ కావడంతో సుదీప కూడా క్లాసికల్ డాన్స్ లు ఇరగదీస్తుంది. ఇదిలా ఉండగా 1994లో రవిరాజా పిన్ని శెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా నటించిన M.ధర్మరాజు MA సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి సుదిప అడుగుపెట్టింది.

do-you-remember-pinky-in-nvvu-naku-nachaavu-movie

do-you-remember-pinky-in-nvvu-naku-nachaavu-movie

ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వంటి సినిమాల్లో నటించినప్పటికీ సుధీప కు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆ తర్వాత 2001లో విజయ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో సుదీప పింకీ పాత్ర చేసింది. ఇక ఈ పాత్ర సుదీప కు ఫుల్ క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత ఎక్కువగా హీరోల చెల్లెలు పాత్రలో నటించి కనువిందు చేసింది సుధీప. ఇక ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలో నటించి బోర్ కొట్టడంతో సుదీప తర్వాత బుల్లితెరలోకి ఎంటర్ అయింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు పొందేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందుకో అవి ఫలించలేదు. అయితే సుధీప ఒకవైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే ఎంబీఏ పూర్తి చేసింది.

ఆ తర్వాత శ్రీ రంగనాథ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆమె క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నడిపిస్తున్నట్లుగా సమాచారం సినిమాలో హీరోయిన్ గా చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ తన కళ నెరవేరకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా వచ్చి ఇలా డాన్స్ క్లాసులు నడిపిస్తున్నట్లు అర్థమవుతుంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి పేరు ఇచ్చినప్పటికీ, హీరోయిన్గా ఎదగాలని ఆమె కలను మాత్రం నెరవేర్చలేకపోయింది. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో , ఎదగాలంటే కొంచెం టాలెంట్ కూడా ఉండాలని అర్థం అవుతుంది.