Adeno virus : చిన్నారులను వణికిస్తున్న అడినో వైరస్ .. ఇప్పటికే 17 మంది మృతి ..

Adeno virus : కరోనా వైరస్ వచ్చాక ప్రపంచమంతా అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా మూడు సంవత్సరాలు కరోనా దేశాన్ని గడగడలాడించింది. అప్పటినుంచి ఏ వైరస్ పేరు విన్న జనాలకు వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారితో చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో వైరస్ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే కరోనా అన్ని వయసుల వారికి వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన […]

  • Published On:
Adeno virus : చిన్నారులను వణికిస్తున్న అడినో వైరస్ .. ఇప్పటికే 17 మంది మృతి ..

Adeno virus : కరోనా వైరస్ వచ్చాక ప్రపంచమంతా అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా మూడు సంవత్సరాలు కరోనా దేశాన్ని గడగడలాడించింది. అప్పటినుంచి ఏ వైరస్ పేరు విన్న జనాలకు వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారితో చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో వైరస్ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే కరోనా అన్ని వయసుల వారికి వచ్చింది.

అయితే ఇప్పుడు వచ్చిన వైరస్ చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుంది. అదే అడినో వైరస్. ఈ వైరస్ పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టిస్తుంది. అనూహ్యంగా వ్యాప్తి చెందుతున్న అడినో వైరస్ బారిన పడి ఇప్పటికే 17 మంది చిన్నారులు మృతి చెందారు. మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారందరిలో అడినో వైరస్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. కరోనా వైరస్ కు ఉండే లక్షణాలే ఈ వైరస్ కు ఉన్నాయి. ఈ వైరస్ సోకిన వెంటనే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ అడినో వైరస్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. న్యుమోనియా సంబంధిత వ్యాధులకు ఈ వైరస్ కారణం అవుతుంది. పిల్లలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడేళ్లుగా ఏదో ఒక వైరస్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆడినో వైరస్ వలన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకి ఆసుపత్రిలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో వైద్యుల సెలవులను రద్దు చేసింది పశ్చిమబెంగాల్ ప్రభుత్వం. 24 గంటలు పిల్లలకు వైద్యం అందేలా చూస్తున్నారు. అలాగే దేశమంత ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది.