Viral News : చనిపోయిందనుకున్న బామ్మ .. ఏడు గంటల తర్వాత లేవడంతో అవాక్కయిన బంధువులు !

Viral News : ఒక మనిషి చనిపోయాక తిరిగి రావడం అనేది జరగని పని. కానీ చనిపోయాక అంత్యక్రియలకు సిద్ధం చేసుకున్నాక ఆ మనిషి లేస్తే ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితిని కుటుంబ సభ్యులు ఎదుర్కోవాల్సిందే. అటువంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. ఆ బామ్మ పేరు జ్ఞాన్ దేవి. ఆమె వయసు 109 సంవత్సరాలు. రూర్కీలోని మంగ్లోర్ లోని నర్సన్ ఖుర్ద్ అనే చిన్న గ్రామం లో బామ్మ కుటుంబం నివసిస్తుంది. కొన్ని […]

  • Published On:
Viral News : చనిపోయిందనుకున్న బామ్మ ..  ఏడు గంటల తర్వాత లేవడంతో అవాక్కయిన బంధువులు !

Viral News : ఒక మనిషి చనిపోయాక తిరిగి రావడం అనేది జరగని పని. కానీ చనిపోయాక అంత్యక్రియలకు సిద్ధం చేసుకున్నాక ఆ మనిషి లేస్తే ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితిని కుటుంబ సభ్యులు ఎదుర్కోవాల్సిందే. అటువంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. ఆ బామ్మ పేరు జ్ఞాన్ దేవి. ఆమె వయసు 109 సంవత్సరాలు. రూర్కీలోని మంగ్లోర్ లోని నర్సన్ ఖుర్ద్ అనే చిన్న గ్రామం లో బామ్మ కుటుంబం నివసిస్తుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మ గత నెల 31వ తారీకున స్పృహ తప్పి పడిపోయింది.

దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ ని పిలవగా ఆయన బామ్మ చనిపోయిందని నిర్ధారించారు. ఒక్కసారిగా బాధపడ్డ కుటుంబం అంతక్రియలకు సిద్ధం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా వచ్చి ఏడుస్తున్నారు. బామ్మ మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేశారు. ఆ సమయంలో బామ్మలో కదలికలు రావడంతో బామ్మను పిలిచారు. దీంతో ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు కాసేపటికి తేరుకొని బామ్మ ఏమైనా తింటావా అని అడిగారు. ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

రసగుల్లా తింటావా, చాట్ తింటావా అని అడిగారు. దీంతో ఆ బామ్మ చాట్ తింటాను అని చెప్పింది. వెంటనే చాట్ తెచ్చి బామ్మకు తినిపించారు. అయితే ఆమె తిరిగి లేవడంపై బామ్మ అల్లుడు మంగే రామ్ మాట్లాడుతూ ఇదంతా ఆరు ఏడు గంటలలో జరిగిందని చెప్పారు. ఇదంతా ఒక మిరాకిల్లా ఉందని అన్నారు. ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చునేసరికి మేమంతా సంతోషపడ్డామని తెలిపారు. దీంతో ఈమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చనిపోయిందనుకున్న బామ్మ లేచి కూర్చోవడం ఏంటి, ఇలాంటివి ఎక్కడ చూడలేదు అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Must Read : Coconut Water : కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయని మీకు తెలుసా ..?