Coconut Water : కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయని మీకు తెలుసా ..?

Coconut Water : కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఎంత తాగితే అంత మంచిది అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. అతిగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఏ విషయంలోనైనా అతి అనేది పనికిరాదు. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. దీని వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరినీళ్లలో […]

  • Published On:
Coconut Water : కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయని మీకు తెలుసా ..?

Coconut Water : కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఎంత తాగితే అంత మంచిది అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. అతిగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఏ విషయంలోనైనా అతి అనేది పనికిరాదు. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. దీని వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరినీళ్లలో మోనోశాకరైడ్ లు పులియబెట్టే ఒలిగోశాకరైడ్ లు పాలియోల్స్ ఉంటాయి.

శరీరంలో వీటి పరిమాణం పెరిగితే శరీరం నుంచి నీటిని పీల్చుకుంటాయి. దీంతో వాంతులు, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి. అందుకే కొబ్బరినీళ్లు రోజు తాగకుండా అప్పుడప్పుడు తాగితేనే మంచిది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు కొబ్బరి నీళ్లను ప్రతిరోజు త్రాగకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు తాగితే మంచిది. కొబ్బరినీళ్ళలో చక్కెరతో పాటు అధిక క్యాలరీల శక్తి ఉంటుంది. అందుకే కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు త్రాగడం మంచిది.

అలాగే కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కొబ్బరినీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉండడంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఒక్కోసారి రక్తపోటు స్థాయి ఒక్కసారిగా తగ్గిపోవచ్చు. దీంతో అనారోగ్య సమస్య ఏర్పడవచ్చు. అతిసారం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొబ్బరి నీళ్లు అతిగా కాకుండా మితంగా తీసుకుంటేనే శరీరానికి మేలు కలుగుతుంది. ఏ ఆహార పదార్థాలు అయినా లిమిట్ గా తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక దేన్నైనా లిమిట్ గా తీసుకుంటే మంచిది.

Must Read : What’s App :వాట్సాప్ కొత్త ఫీచర్ .. కాల్ చేయడానికి షార్ట్ కట్ ..