Sleep : రాత్రిపూట నిద్ర రావడం లేదా ..? ఈ మంత్రాన్ని జపించండి క్షణాల్లో నిద్రపోతారు ..!!

Sleep : నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. సరిపడ నిద్ర పోకపోతే ఆ రోజంతా మనిషి నీరసంగా, చికాకుగా ఉంటాడు. అంతే కాదు నిద్రలేమి సమస్యల వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి ఎంత పని చేసినా రాత్రి సమయంలో సరైన సమయానికి నిద్రపోతే మనిషికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత రాత్రి […]

  • Published On:
Sleep : రాత్రిపూట నిద్ర రావడం లేదా ..? ఈ మంత్రాన్ని జపించండి క్షణాల్లో నిద్రపోతారు ..!!

Sleep : నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. సరిపడ నిద్ర పోకపోతే ఆ రోజంతా మనిషి నీరసంగా, చికాకుగా ఉంటాడు. అంతే కాదు నిద్రలేమి సమస్యల వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి ఎంత పని చేసినా రాత్రి సమయంలో సరైన సమయానికి నిద్రపోతే మనిషికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత రాత్రి సమయంలో నిద్ర పోకుండా ఎక్కువగా మొబైల్స్ చూస్తూ లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

అలాగే పనిలో ఒత్తిడి వలన కూడా కొందరు రాత్రులు నిద్రపోకుండా గడుపుతున్నారు. మరి కొంతమంది రాత్రి టైంలో ఫోన్ ఎక్కువగా వాడుతూ తెల్లవారుజామున వరకు నిద్రపోకుండా ఉంటారు. అదే అలవాటుతో ఫోన్ వాడని సమయంలో కూడా నిద్ర రాకుండా సతమతమవుతుంటారు. అయితే అలాంటి సమస్యలను నుంచి బయటపడడానికి ఈ మంత్రాన్ని జపిస్తే చాలు. ఎవరికైతే అర్ధరాత్రి నిద్ర రాదో వారు ముందుగా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత దేవుడిని ఒకసారి ధ్యానించుకొని ఈ మంత్రాన్ని పటించాలి.

“అగస్తి మార్గవశ్చైవ ముచుకుండే మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయనః ” అని కళ్ళు మూసుకుని జపిస్తే నిద్ర ఇట్లే వస్తుంది. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో వారిలో వచ్చే మార్పును చూసి ఆశ్చర్యపోతారు అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎవరైనా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ మంత్రాన్ని వారంరోజులు జపిస్తే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇకపోతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. మనం ఎంత పని చేసిన శరీరానికి రాత్రి సమయంలో రెస్ట్ ఇవ్వడం వలన రేపటి రోజున శరీరం యాక్టివ్ గా ఉంటుంది.