Ayodhya ram mandir : అయోధ్య రామయ్య సుందర రూపం…ఐదేళ్ల బాలుని రూపంలో దర్శనం…

Ayodhya ram mandir  : కేవలం భారత ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందూ సమాజం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎప్పటినుండో అయోధ్యలో రామాలయం కట్టాలనుకుంటున్న హిందువుల కోరిక నెరవేరబోతోంది. మరో నాలుగు రోజులు రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయితే ప్రాణ ప్రతిష్టకు ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముని ప్రతిమను నిర్వాహకులు ప్రతిష్టించారు. ఇక ఆ బాల రాముని సుందర రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం […]

  • Published On:
Ayodhya ram mandir : అయోధ్య రామయ్య సుందర రూపం…ఐదేళ్ల బాలుని రూపంలో దర్శనం…

Ayodhya ram mandir  : కేవలం భారత ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందూ సమాజం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎప్పటినుండో అయోధ్యలో రామాలయం కట్టాలనుకుంటున్న హిందువుల కోరిక నెరవేరబోతోంది. మరో నాలుగు రోజులు రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయితే ప్రాణ ప్రతిష్టకు ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముని ప్రతిమను నిర్వాహకులు ప్రతిష్టించారు. ఇక ఆ బాల రాముని సుందర రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే తాజాగా బాల రామునికి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్వాహకులు విడుదల చేయడం జరిగింది.

beautiful-form-of-ayodhya-rama-appeared-in-the-form-of-a-five-year-old-boy

దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దర్శనమిస్తున్న బాల రాముని విగ్రహన్ని కృష్ణ శిలతో శిల్పి అరుణ్ యోగి రాజు చెక్కడం జరిగింది. ఐదు అడుగుల పొడవు 150 కేజీల బరువు కలిగివున్న బాల రాముని విగ్రహం నల్లని పద్మ పీఠంపై ఐదేళ్ల బాలుడి రూపంలో కొలువుదీరి ఉంది. ఇక విగ్రహం మొహంపై చిరుదరహాసంతో నుదిటిన మూడు నామాలతో సుందరమైన రూపంతో ఆకట్టుకుంటున్నాడు. బంగారపు వీళ్ళు ధరించి బాణం చేత పట్టుకుని నిలుచున్న బాలరాముడు ఆకర్షణీయంగా ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా అభిజిత్ మూహూర్తంలో పుష్య శుక్ల ద్వాదశి రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్యుని కిరణాలు సహజంగా పడేలా అద్భుతమైన టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించారు. ఇక జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 -1.00 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక ఈ వేడుకలకు యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఇక ఈ ఉత్కంఠ భరితమైన వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.