Pineapple : రోజు పైనాపిల్ తింటే ఇన్ని ప్రయోజనాల…ఇక డాక్టర్ అవసరమే ఉండదు..

Pineapple : మనదేశంలో పుష్కరాల నుంచి సూపర్ మార్ట్ ల వరకు చూసుకుంటే అన్నిచోట్ల లభించే పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ ఉష్ణ మండల పండు పైనాపిల్ యొక్క రుచి చాలా ప్రత్యేకమైనది. అలాగే పైనాపిల్ లో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రయోజకరమైన ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైనాపిల్ తినడం వలన రోగనిరోధక శక్తి మరియు బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, […]

  • Published On:
Pineapple : రోజు పైనాపిల్ తింటే ఇన్ని ప్రయోజనాల…ఇక డాక్టర్ అవసరమే ఉండదు..

Pineapple : మనదేశంలో పుష్కరాల నుంచి సూపర్ మార్ట్ ల వరకు చూసుకుంటే అన్నిచోట్ల లభించే పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ ఉష్ణ మండల పండు పైనాపిల్ యొక్క రుచి చాలా ప్రత్యేకమైనది. అలాగే పైనాపిల్ లో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రయోజకరమైన ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైనాపిల్ తినడం వలన రోగనిరోధక శక్తి మరియు బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, కె మరియు ఫాస్పరస్, కాల్షియం మరియు జింక్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల బారిన పడకుండా సహాయపడతాయి. ఇక దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

so-many-benefits-if-you-eat-pineapple-a-day-no-more-doctor-needed

అలాగే మాంగనీస్ జీవక్రియ రేటును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అయితే పైనాపిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కొన్ని ప్రధాన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహారంలో ఒకే టైంలో తీపి పులుపు మరియు లవణం వంటి ఆహారాలు ఉంటాయి. దీనివలన మీకు నీరసంగా మరియు గుండెల్లో మంటగా అనిపించవచ్చు. అజీర్ణం కడుపునొప్పి , లేదా శరీరం అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే పైనాపిల్ ముక్కలను లేదా జ్యూస్ తాగడం వలన ఈ సమస్య ఇట్టే మాయమవుతుంది. అలాగే పైనాపిల్ లో ఉండే బ్రోమోలైన్ ఎంజైమ్,డైటరీ ఫైబర్ మరియు విటమిన్ సి డయేరియా ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

so-many-benefits-if-you-eat-pineapple-a-day-no-more-doctor-needed

మరికొన్ని అధ్యయనాలు ప్రకారం పైనాపిల్ లో అధికం మొత్తంలో లభించే మాంగనీస్ మన ఎముకలను బలోపేతం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందట. శరీరం ఆరోగ్యంగా మరియు ఎముకలు దృఢంగా ఉండేందుకు మన ఆహారంలో రోజు క్రమం తప్పకుండా పైనాపిల్ తీసుకోవడం చాలా మంచిది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషియన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అధిక ఆంటీ ఆక్సిడెంట్లు మరియు రక్త సాంద్రతలను కలిగి ఉన్నఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ విధంగా చూసుకుంటే పైనాపిల్ లో ఈ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే పైనాపిల్ జీవక్రియను మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.