Zodiac Signs : ఈ రోజు (24-10-2022) సోమవారం రాశి ఫలితాలు మేషం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.