Zodiac Signs : అక్టోబర్ 24 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs : ఈ రోజు (24-10-2022) సోమవారం రాశి ఫలితాలు మేషం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం: చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 24 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs :

ఈ రోజు (24-10-2022) సోమవారం రాశి ఫలితాలు

మేషం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

మిధునం: వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలొ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

కర్కాటకం: సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి.

కన్య: ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు.

వృశ్చికం: వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది.

ధనస్సు: బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

మకరం: భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కుంభం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలొ అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.

మీనం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

Must Read: ఎద అందాలతో కుర్రల్లా మతి పోగొడుతున్న ఆశు రెడ్డి