Asian Games 2023 : భారత్ కు మరో బంగారు పతకం…మెన్స్ క్రికెట్ లో భారత్ కు స్వర్ణం…

Asian Games 2023  : ఆసియా క్రీడలు 2023 లో భాగంగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కు మరియు భారత్ కు మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించింది. విపరీతమైన వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్వర్ణం సాధించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఎక్కువ సీడ్ ఉండడంతో భారత్ విజేతగా నిలిచినట్లు అర్థమవుతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రజత […]

  • Published On:
Asian Games 2023 : భారత్ కు మరో బంగారు పతకం…మెన్స్ క్రికెట్ లో భారత్ కు స్వర్ణం…

Asian Games 2023  : ఆసియా క్రీడలు 2023 లో భాగంగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కు మరియు భారత్ కు మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించింది. విపరీతమైన వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్వర్ణం సాధించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఎక్కువ సీడ్ ఉండడంతో భారత్ విజేతగా నిలిచినట్లు అర్థమవుతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి గాను 112 పరుగులు చేయగా మ్యాచ్ మధ్యలో వర్షం రావడం తో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది.

another-gold-medal-for-india-gold-for-india-in-mens-cricket

ఇక తర్వాత మరల మ్యాచ్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ t20 ర్యాంకింగ్స్ ఆధారంగా చేసుకుని ఆసియా 2023 మెన్స్ క్రికెట్ లో భారత్ ను విజేతగా ప్రకటించారు . అయితే ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం 10వ స్థానం లో ఉంది. దీంతో భారత్ ను విజేతగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కు మరో స్వర్ణం వచ్చి పడింది. ఇది ఇలా ఉండగా అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.